Skip to content

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ ట్రైలర్

శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలలై ఈ సినిమా ఫస్ట్ సింగిల్, ఫస్ట్ సింగిల్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మెన్షన్ హౌస్ మల్లేష్ ట్రైలర్ ని లాంచ్ చేశారు.

మురళీధర్ గౌడ్ ‘అదొక పెద్ద కథ’ అని చెప్పడంతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. మల్లేష్ క్యారెక్టరైజేషన్, పెళ్లి చూపులు, పెళ్లి తర్వాత జరిగిన సంఘటనలు.. అన్నీ మంచి వినోదాన్ని పంచాయి. డాక్టర్ బ్రాండ్ పేరు అడిగితే ‘జై బాలయ్య’ అని చెప్పడం మాస్ కి మరింత కనెక్ట్ అయ్యింది.

శ్రీనాథ్ మాగంటి మల్లేశ్ పాత్రలో ఒదిగిపోయారు. తను బాడీలాంజ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్ అద్భుతంగా వున్నాయి. గాయత్రి రమణ పాత్ర కూడా ఎమోషన్ ని యాడ్ చేసింది. మురళీధర్ గౌడ్, రాజ్ కుమార్ కసిరెడ్డి పాత్రలు మంచి వినోదాన్ని పంచాయి.

డైరెక్టర్ బాల సతీష్ అందరికీ కనెక్ట్ అయ్యే కథని అద్భుతంగా తీర్చిదిద్దారు. సురేష్ బొబ్బిలి నేపధ్య సంగీతం ప్రతి సీన్ ని ఎలివేట్ చేసింది. అమ్మముత్తు కెమరా వర్క్ కథకి డెప్త్ ని జోడించింది. టెక్నికల్ గా సినిమా మంచి క్యాలిటీతో తీర్చిదిద్దారు. మొత్తానికి ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మార్చి 6న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

తారాగణం: శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల, రాజేష్, మురళీధర్ గౌడ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, సాయి ప్రసన్న, పద్మ నిమ్మనగోటి, హరి రెబెల్

రచన & దర్శకత్వం: బాల సతీష్
నిర్మాత: రాజేష్
బ్యానర్: కనకమేడల ప్రొడక్షన్స్
సంగీతం : సురేష్ బొబ్బిలి
డీవోపీ: అమ్మముత్తు
ఎడిటర్: గ్యారీ BH
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, పూర్ణాచారి, అనిరుద్ శాండిల్య మారంరాజు, తరుణ్ సైదులు
పీఆర్వో: వంశీ – శేఖర్