Skip to content

‘మెన్షన్ హౌస్ మల్లేష్’ సినిమాతో ఆడియన్స్ నా పేరు గుర్తుపెట్టుకుంటారు : హీరో శ్రీనాథ్ మాగంటి

శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలలై టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం మార్చి 6న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీనాథ్ మాగంటి విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఈ సినిమాకి ‘మాన్షన్ హౌస్ మల్లేష్’ అనే టైటిల్ పెట్టడానికి కారణం?
-మా టైటిల్ మెన్షన్ హౌస్ మల్లేష్.. అయితే ఓవర్ లుక్ లో టైటిల్ ని అలా అనిపిపిస్తోంది. ఇందులో నా క్యారెక్టర్ తప్పుగా ఆ పేరు రాస్తాడు. కానీ జనాలు రైట్ గా చదువుతున్నారు. సినిమాకి క్యాచి టైటిల్ కావాలి. అలా ఈ టైటిల్ తో ఆకట్టుకున్నాం. పాటలు కూడా జనాల్లోకి వెళ్ళాయి.

మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
-ఒక పొగరుబోతు, దారితప్పి లేనిపోనీ అలవాట్లుతో వున్న ఓ క్యారెక్టర్ ని అతని తల్లి, భార్య ఎలా దారిలోకి తీసుకోస్తారనేది చాలా సరదాగా చెప్పాం. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ కామెడీ జానర్ ఫిల్మ్. ఫ్యామిలీ అంతా కలసి నవ్వుకునే సినిమా.

మీరు చాలా క్లాస్ గా కనిపిస్తారు ఫస్ట్ టైం ఇంత మాస్ క్యారెక్టర్ చేయడం ఎలా అనిపించింది?
హిట్ లో నీట్ గా ఉంటాను, అలాగే యానిమల్ లో కూడా నా క్యారెక్టర్ క్లాస్ గా ఉంటుంది. లక్కీ భాస్కర్ లో స్టైల్ మార్చుకుని వింటేజ్ లుక్ లో కనిపిస్తాను. నా మొహం చూస్తే చాలామంది క్లాస్ అనుకుంటారు, అంతేకాదు నేను తెలుగు వాడిని చెప్పుకోవడం కూడా నాకు ఒక సెపరేట్ కష్టం (నవ్వుతూ) నేను అమీర్ పేట్ బ్యాచ్ పక్కా తెలుగువాడిని.

-ఈ సినిమాలో నన్ను నేను కొత్తగా చూపించుకోడానికి ఒక అవకాశం దొరికింది. ఈ సినిమా యాక్టర్ కోసం కొన్ని రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ని అబ్జర్వ్ చేశాను. అలాగే మా అమ్మ పాత చున్ని ఉంటే దాన్ని చొక్కాగా కుట్టించుకుని వేసుకున్నాను. మల్లేష్ ని చూపించడానికి నేను చాలా మారాల్సి వచ్చింది. ఈ సినిమాతో ఆడియన్స్ నా పేరు గుర్తుపెట్టుకుంటారని నమ్ముతున్నాను.

సందీప్ రెడ్డి వంగా గారు. ట్రైలర్ లాంచ్ చేశారు కదా.. ఆయన రియాక్షన్ ఏంటి?
-ఆయనకు చాలా నచ్చింది. ట్రైలర్ చూసినంత సేపు నవ్వుకుంటున్నారు. సినిమా కూడా థియేటర్స్ లో చూస్తానని చెప్పారు ప్రస్తుతం స్పిరిట్ లో చాలా బిజీగా ఉన్నారు.

డైరెక్టర్ బాల సతీష్ గురించి?
సతీష్ గారికి ఇది ఫస్ట్ సినిమా. ఆయన చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ ఇలా అన్ని విషయాల్లోనూ చాలా కేర్ తీసుకున్నారు. ఈ సినిమాతో ఆయన మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఒక దర్శకుడు విజయం సాధిస్తే చాలా మంచి కథలు వస్తాయి. ఇది యూనివర్సల్ సబ్జెక్టు. కాకపోతే తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది.

నిర్మాత రాజేష్ గురించి?
-రాజేష్ గారు అమెరికా నుంచి సినిమా అంటే చాలా పాషన్ తో వచ్చారు. సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. అంత జాగ్రత్తగా చేసాం. ఒక నిర్మాత గెలిస్తే ఒక డైరెక్టర్ హీరో గెలుస్తాడు. నిర్మాత గెలిస్తే సినిమా టీమ్ అందరు గెలిచినట్లే. ఈ సినిమా అందర్నీ గెలిపిస్తుందని నమ్ముతున్నాను. ఆయన ఈ సినిమాలో నటించారు. అలాగే కొన్ని డైలాగ్స్ కూడా రాశారు.

-ఇందులో అమ్మముత్తు గారి కెమెరా వర్క్ చాలా అద్భుతంగా ఉంటుంది. సినిమా చూస్తున్నప్పుడు ఒక ఊర్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ ఈ సినిమాకి సోల్.

-రాజ్ కుమార్ కసిరెడ్డి, మురళీధర్ గౌడ్ అలాగే రాజేష్ గారి క్యారెక్టర్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. కీడాకోలాలో చేసిన హరి ఇందులో మంచి క్యారెక్టర్ చేశాడు. దురదృష్టవశాత్తు ఆయన సినిమా రిలీజ్ కాకముందే చనిపోవడం చాలా బాధ కలిగించింది. ఈ సినిమా రూపంలో తను ఎప్పటికీ బతికి ఉంటాడు.

హీరోయిన్ గురించి ?
గాయత్రీ రమణ గారు హీరోయిన్ గా చేశారు. తను కూచిపూడి డాన్సర్. అలాగే 100% లవ్ అనే వెబ్ సిరీస్ చేశారు. ఈ సినిమాలో చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. అలాగే ఈ సినిమాలో నటించిన ప్రతి నటీనటులు చాలా సపోర్ట్ చేశారు.

విశ్వక్, తరుణ్ భాస్కర్ గురించి?
-విశ్వక్, తరుణ్ గారికి ట్రైలర్ చాలా నచ్చింది. కంటెంట్ నచ్చడంతోనే ఈవెంట్ కి వచ్చారు. అలాగే సందీప్ గారు కూడా కంటెంట్ నచ్చే ట్రైలర్ లాంచ్ చేశారు.

కొత్తగా చేస్తున్న సినిమాలు గురించి?
-‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ చేస్తున్నాను. ఆ షూటింగ్ చాలా సరదాగా సాగుతోంది. అలాగే సోలో హీరోగా కొన్ని కథలు వింటున్నాను.