‘పొలిమేర 3’లో ‘విరావి’గా అర్జున్
వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ సంయుక్తంగా నిర్మిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ 'పోలిమేర-3' ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా 'విరావి'గా ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆగస్టు 15న అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఓటీటీలో ‘మా ఊరి పొలిమేర’తో సంచలనం సృష్టించి, ‘పొలిమేర 2’తో థియేట్రికల్ బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ ఇప్పుడు తదుపరి అధ్యాయంలోకి అడుగుపెట్టింది. విజనరీ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పొలిమేర 3’ చిత్రాన్ని వంశీ నందిపాటి, జాన్వీ నారంగ్ నిర్మిస్తున్నారు. ఈ ఇద్దరు అభిరుచి గల నిర్మాతల అసోసియేషన్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం…
