Skip to content

‘పొలిమేర 3’లో ‘విరావి’గా అర్జున్‌

వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ సంయుక్తంగా నిర్మిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ ‘పోలిమేర-3’ ఈ చిత్రంలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ సర్జా ‘విరావి’గా ఓ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించబోతున్నారు. ఆగస్టు 15న అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఓటీటీలో ‘మా ఊరి పొలిమేర’తో సంచలనం సృష్టించి, ‘పొలిమేర 2’తో థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ ఇప్పుడు తదుపరి అధ్యాయంలోకి అడుగుపెట్టింది. విజనరీ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పొలిమేర 3’ చిత్రాన్ని వంశీ నందిపాటి, జాన్వీ నారంగ్ నిర్మిస్తున్నారు.

ఈ ఇద్దరు అభిరుచి గల నిర్మాతల అసోసియేషన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం మరింత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ‘పొలిమేర 3’ చిత్రాన్ని చిత్రబృందం ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అనౌన్స్‌మెంట్‌లో అతిపెద్ద సర్‌ప్రైజ్, ప్రధాన ఆకర్షణ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘పొలిమేర’ యూనివర్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడం. ‘బ్లాస్ట్ జోన్’తో భారీ విజయాన్ని అందుకున్న అర్జున్.. ఈ ఫ్రాంచైజ్‌లో పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.

అర్జున్ సర్జా పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన పాత్ర పేరును వెల్లడిస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో అర్జున్ ‘విరావి’ పాత్రలో నటిస్తున్నారు. పోస్టర్‌లో ఆయన కండలు తిరిగిన చేతిపై ఉన్న పరమశివుని త్రిశూలం, శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రం టాటూలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. త్వరలోనే ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చిత్రబృందం చేసిన ఈ చిన్నదైనా బలమైన ప్రకటన సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, దక్షిణాది వ్యాప్తంగా ఉన్న అపారమైన క్రేజ్‌తో ప్రేక్షకులను అలరించే అర్జున్ ఎంట్రీతో ‘పొలిమేర 3’పై అంచనాలు మరింత పెరిగాయి.

గ్రిప్పింగ్ కథనం, ఊహించని ట్విస్టులతో ‘పొలిమేర’ను కల్ట్ ఫేవరెట్‌గా నిలిపిన దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్.. ఇప్పటివరకు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన స్క్రీన్‌ప్లేతో ‘పొలిమేర 3’ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ మూడో భాగంతో ఫ్రాంచైజ్ గత చిత్రాల హద్దులను దాటి మరింత ముందుకు వెళ్లనుంది. మరింత లోతైన మిస్టరీలు, డార్క్ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, షాకింగ్ రివిలేషన్స్‌తో ‘పొలిమేర’ యూనివర్స్‌ను సరికొత్త స్థాయికి తీసుకెళ్లనున్నారు.

పొలిమేర, పొలిమేర-2తో తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఐకానిక్ కొమురయ్య పాత్రలో సత్యం రాజేష్ మరోసారి అలరించనున్నారు. ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల పాత్ర కూడా కీలకంగా ఉండనుంది., గెటప్ శ్రీను, బాలాదిత్య, రాకేందు మౌళి తదితర ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు వచ్చిన ‘పొలిమేర’ చిత్రాల్లోనే అతిపెద్ద తారాగణంతో ‘పొలిమేర 3’ తెరకెక్కుతోంది.

ఆసక్తికరమైన తారాగణం, ప్రతిభావంతమైన సాంకేతిక బృందం, భారీ స్థాయి కథాంశంతో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న అత్యంత ఆసక్తికరమైన చిత్రాల్లో ‘పొలిమేర 3’ ఒకటిగా నిలిచింది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.