Skip to content

‘పెద్ది’ సెకండ్ సింగిల్ రై రై రారా రిలీజ్

‘పెద్ది’ సెకండ్ సింగిల్ రై రై రారా రిలీజ్ Telugu News

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా ‘పెద్ది’ తో బాక్సాఫీస్‌ను అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు వచ్చిన సెన్సేషనల్ రెస్పాన్స్‌తో సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని ఎపిక్ స్కేల్‌లో తెరకెక్కిస్తూ, రామ్ చరణ్‌ను పూర్తిగా రగ్గడ్ అవతార్‌లో చూపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఆస్కార్ విజేత ఎఆర్ రెహ్మాన్ సమకూరుస్తున్నారు. తాజాగా మేకర్స్ రెండో సింగిల్ “రై రై రా రా”ను విడుదల చేశారు.

ఏఆర్ రెహ్మాన్ స్వయంగా ఆలపించిన ఈ పవర్ ఫుల్ డ్యాన్స్ నంబర్ ప‌ల్సేటింగ్ బీట్స్, ఇన్‌ఫెక్షియస్ రిథమ్‌తో అదిరిపోయే మాస్ ఎనర్జీని అందిస్తోంది. స్టార్ ఎంట్రీ సాంగ్ ఎలా ఉండాలో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తూ, భారతీయ సినిమాలోనే అత్యంత భారీ, ఎలక్ట్రిఫైయింగ్ ఇంట్రడక్షన్ నంబర్‌లలో ఒకటిగా నిలిచేలా రూపుదిద్దుకుంది.

రామ్ చరణ్ తన ట్రేడ్‌మార్క్ మాస్ ఎనర్జీ, గ్రేస్‌ఫుల్ ఫినెస్ తో అదరగొట్టారు. ఆయన ఫ్లూయిడ్ మూవ్‌మెంట్స్, పవర్‌ఫుల్ ఫుట్‌వర్క్, కరిస్మాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఈ పాటను ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా మార్చేశాయి. జానీ మాస్టర్ అందించిన డైనమిక్ కొరియోగ్రఫీ విజువల్ ట్రీట్ గా నిలిచింది.

అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం పూర్తి మాస్ అప్పీల్‌తో ఆకట్టుకుంది, ప్రతి లైన్ రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరింత ఎలివేట్ చేస్తోంది. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా అందించిన విజువల్ సెటప్, సినిమాటోగ్రాఫర్ R. రత్నవేలు గ్రాండియర్ లెన్సింగ్‌తో ఈ సాంగ్ లార్జ్ స్క్రీన్ ఫీస్ట్‌గా నిలిచింది.

ఈ భారీ స్టార్ ఎంట్రీ నంబర్ రామ్ చరణ్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌ను సెలబ్రేట్ చేస్తూ, సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. భారతీయ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్‌లలో ఒకటిగా నిలిచింది.

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

పెద్ది ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌ కానుంది. సమ్మర్ హాలిడే సీజన్‌ను డామినేట్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ టైం.

తారాగణం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సాన
సమర్పకులు: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా
సంగీతం: ఏఆర్ రెహమాన్
DOP: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్

See also  చంద్రబాబు నాయుడును కలిసిన రాజేంద్ర ప్రసాద్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.