Skip to content

#NBK112 అమరావతిలో జూన్ 25న గ్రాండ్ లాంచ్- ముఖ్య అతిథులుగా మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్

#NBK112 అమరావతిలో జూన్ 25న గ్రాండ్ లాంచ్- ముఖ్య అతిథులుగా మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ Telugu News

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంచలన దర్శకుడు కొరటాల శివ తొలిసారిగా #NBK112 చిత్రం కోసం జతకడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే అభిమానులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలు పెంచింది. “Power Meets Purpose, Mass Becomes A Movement” అనే పవర్ ఫుల్ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన అనౌన్స్‌మెంట్ పోస్టర్, ఈ చిత్రం ఎంత భారీ స్థాయిలో ఉండబోతుందో సూచించింది. ఇద్దరు విజయవంతమైన నిర్మాతలు SLV సినిమాస్‌ సుధాకర్ చెరుకూరి, యువసుధ ఆర్ట్స్‌ సుధాకర్ మిక్కిలినేని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలను మరింత పెంచుతూ, అమరావతి సమీపంలోని వెంకటాయపాలెంలో ఉన్న TTD ఆలయంలో జూన్ 25న గ్రాండ్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరుకానుండటంతో ఈ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనుంది.

బాలకృష్ణ భారీ స్థాయి స్క్రీన్ ఇమేజ్‌కు సరిపోయేలా కొరటాల శివ ఒక పవర్ ఫుల్ కథని సిద్ధం చేశారు. మాస్ సినిమాలు చేయడంలో ప్రసిద్ధి చెందిన ఇద్దరు దిగ్గజాలు తొలిసారిగా కలిసి పనిచేస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.

నటీనటులు: నందమూరి బాలకృష్ణ

సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: కొరటాల శివ
నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని
బ్యానర్లు: SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్
PRO: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.