పద్మశ్రీ వరించిన సందర్భంగా మురళీ మోహన్‌ను సన్మానించిన ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ టీం
లెజెండరీ యాక్టర్ మురళీ మోహన్‌కు కేంద్రం తాజాగా పద్మశ్రీని ప్రకటించిన సంగతి తెలిసిందే. మురళీ మోహన్‌కి పద్మశ్రీ ప్రకటించడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. ఇక ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లి అభినందిస్తున్నారు. ఈ క్రమంలో ‘డొక్కా సీతమ్మ’ టీం ఆయన్ను స్వయంగా కలిసి సన్మానించింది. డొక్కా సీతమ్మ టీం మురళీ మోహన్ ఇంటికి వెళ్లింది. దర్శక, నిర్మాతలు మురళీ మోహన్‌ను కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సినిమాలోని ఆర్టిస్టులు, ఇతర కాస్ట్ క్రూ మెంబర్స్ అంతా పాల్గొన్నారు. ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. టైటిల్…
