తిరుమలలో శ్రీవారి సన్నిధిలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ దర్శనం!
ప్రముఖ చలనచిత్ర నిర్మాత కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మాతల్లో ఒకరైన ఎన్.కె.లోహిత్ శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమల చేరుకున్నారు. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్న లోహిత్, ఈ ఉదయం విఐపి బ్రేక్ సమయంలో స్వామివారి సన్నిధిలో విశేష పూజలు జరిపారు. భక్తిశ్రద్ధలతో తన మొక్కులు చెల్లించుకుని, శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్నారు. అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో ఆయనను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు లోహిత్‌ను పట్టు వస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు లోహిత్ సన్నిహితులు కూడా పాల్గొన్నారు. స్వామివారి దర్శనం తనకు అపార ఆధ్యాత్మిక శాంతిని, ఆనందాన్ని కలిగించిందని లోహిత్ తెలిపారు. తన రాబోయే…
