వీరభద్రుడు నుంచి ‘గాడ్ మోడ్’ సాంగ్ రిలీజ్
సూర్య తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'వీరభద్రుడు' కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని స్కేల్, కంటెంట్ రెండింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ అంచనాలని సృష్టించింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి గాడ్ మోడ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ సినిమాపై అంచనాలను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. సాయి అభ్యంకర్ కంపోజ్ చేసిన…
