‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షక మహాశయులకు కృతజ్ఞతలు: రవితేజ
మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. జనవరి 13న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మీట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ మీట్ లోమాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ... అందరికీ హయ్. చాలా హ్యాపీగా ఉంది. ఆర్ డైరెక్టర్ ప్రకాష్, డిఓపి ప్రసాద్ తో ఎన్నో ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాను. వాళ్ళతో కలిసి మరోసారి పనిచేయడం ఎంత ఆనందాన్నిచ్చింది…
