‘రావు బహదూర్’ సినిమా జూన్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్
సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్, ప్రముఖ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో, వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్' చిత్రాన్ని సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. 'రావు బహదూర్' జూన్ 5న థియేటర్లలోకి రానుందని అఫీషియల్ గా ప్రకటించారు. అకడమిక్ సీజన్ ప్రారంభానికి ముందు ఈ రిలీజ్ ప్లాన్ చేయడం మంచి స్ట్రాటజిక్‌గా కనిపిస్తోంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో సత్యదేవ్ రాయల్ అవతార్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో, అధికారం, రహస్యభావం కలిసిన లుక్‌తో ఆయన ప్రెజెన్స్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆయన పాగాలో కనిపించే చిన్న పురుగు ఒక సింబాలిక్ అంశంగా…
