‘లెనిన్’ లో ప్రేక్షకులు సరికొత్త అఖిల్‌ను చూస్తారు – నాగార్జున
యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్ అఖిల్ అక్కినేని నెక్ట్స్ మూవీ ‘లెనిన్’ సినిమా నుంచి ఇప్పటి వరకు ‘వారెవా వారెవా..’ , ‘ఎట్టా ఎట్టా..’ అనే రెండు సాంగ్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రెండు చార్ట్‌బస్టర్ సాంగ్స్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. మ్యూజికల్ సెన్సేషనల్ తమన్ సంగీత సారథ్యంలో విడుదలైన ఈ పాటలు అందరి దృష్టిని ఆకర్షించి సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇటీవల కింగ్ నాగార్జున.. లెనిన్ మూవీ ఫస్ట్ కాపీని చూసి సినిమా అవుట్‌పుట్‌తో పాటు టీమ్ పనితీరుపై చాలా ఇంప్రెస్ అయ్యారు. అంతే కాకుండా, నిన్న సినిమా చూశానని, ఎంతో నచ్చిందని బుధవారం రోజున తన ఎక్స్ అకౌంట్ (ట్విట్టర్)లో ట్వీట్ ద్వారా తెలియజేశారు…
