‘జెట్లీ’ రిలీజ్ ట్రైలర్ విడుదల
టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ’తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యూనిక్ కథలతో, అన్‌ప్రెడిక్టబుల్ హ్యూమర్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ద్వయం, ఈసారి మరింత పెద్ద స్థాయిలో, మరింత వినోదంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైయ్యారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో మంచి బజ్ సృష్టించిన ఈ చిత్రం, తాజాగా రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇప్పటి వరకు కథను మిస్టరీగా ఉంచిన ప్రమోలకు భిన్నంగా, ఈ రిలీజ్ ట్రైలర్‌లో కథ కోర్ కాన్ఫ్లిక్ట్ ని చూపించారు. కథ ప్రజాపతి అనే కాన్‌మ్యాన్ చుట్టూ తిరుగుతుంది. మధ్యతరగతి…
