Skip to content

‘కాకా’ నుంచి అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ తర్వాత ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’తో రాబోతున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. భారీ స్థాయిలో హై-ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌లో మెగాస్టార్ ను రెండు డిఫరెంట్ షేడ్స్‌లో చూపించడంతో సినిమాపై మాస్‌లో భారీ క్రేజ్ ఏర్పడింది.

ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అనస్వర రాజన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. చేతుల్లో పుస్తకాలు, వైట్ కోట్, స్టెతస్కోప్, భుజంపై బ్యాక్‌ప్యాక్‌తో సింపుల్‌, అమాయకంగా కనిపించే అమ్మాయిగా అనస్వరను ప్రజెంట్ చేశారు. ఆమె సింపుల్ లుక్ పోస్టర్‌కు ఎంతో సహజమైన ఫీల్‌ను తీసుకురావడంతో పాటు, ఆమె మెడికల్ కాలేజ్ స్టూడెంట్ పాత్రకు తగ్గట్టుగా ఉంది.

ఆమె వెనుక పడిన నీడ పోస్టర్ మూడ్‌ను పూర్తిగా మార్చేస్తోంది. గోడపై మెగాస్టార్ చిరంజీవి సిల్హౌట్ కనిపిస్తూ, అనస్వర సాఫ్ట్, చీర్‌ఫుల్ అప్పియరెన్స్‌కు ఆసక్తికరమైన కాంట్రాస్ట్‌ను క్రియేట్ చేస్తోంది. అనస్వరను రక్షించడానికి చిరంజీవి ‘సత్యం’ పాత్ర అక్కడ ఉందని హింట్ ఇంస్తోంది. ఈ కంపోజిషన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

అనస్వరను మేకర్స్ “హార్ట్ ఆఫ్ కాకా”గా ఆమె పాత్రను “అమ్ములు పాప”గా రివిల్ చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.

ఈ సినిమాకు ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. ఆంటోనీ ఎల్ రూబెన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటర్స్ గా చేస్తున్నారు. భాను-నందు డైలాగ్స్ రాస్తున్నారు.

‘కాకా’ 2027 జనవరి 13న సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, అనశ్వర రాజన్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాత: వెంకట్ కె నారాయణ
బ్యానర్: కెవిఎన్ ప్రొడక్షన్స్
సంగీతం: థమన్ ఎస్
స్క్రీన్ ప్లే రైటర్స్: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
అడిషినల్ స్క్రీన్ ప్లే రైటర్స్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
DOP: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: ఆంటోనీ రూబెన్
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
VFX సూపర్‌వైజర్: యుగంధర్ టి
డైలాగ్స్: భాను-నందు
ముఖ్య కో-డైరెక్టర్లు: బెల్లంకొండ సత్యం, పూసల రాధాకృష్ణ
కో-డైరెక్టర్: వి క్రాంతి చక్రవర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శరణ్య పోట్ల
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.