‘కాకా’ నుంచి అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి ‘వాల్తేరు వీరయ్య’ సక్సెస్ తర్వాత ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’తో రాబోతున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. భారీ స్థాయిలో హై-ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌లో మెగాస్టార్ ను రెండు డిఫరెంట్ షేడ్స్‌లో చూపించడంతో సినిమాపై మాస్‌లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అనస్వర రాజన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. చేతుల్లో పుస్తకాలు, వైట్ కోట్, స్టెతస్కోప్, భుజంపై బ్యాక్‌ప్యాక్‌తో సింపుల్, అమాయకంగా కనిపించే అమ్మాయిగా అనస్వరను ప్రజెంట్…
