Skip to content

ఆహా ఓటీటీ ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 6’ లాంఛ్ ఈవెంట్

ఈ నెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు వస్తున్న ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 6’

ఆహా ఓటీటీ సూపర్ హిట్ వంటల కార్యక్రమం చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్ 6 లాంఛ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ లో సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ, డైరెక్టర్ నందినీ రెడ్డి జడ్జ్ లు గా వ్యవహరిస్తున్నారు. ఫన్, ఫుడ్, ఎంటర్ టైన్ మెంట్ తో సాగే ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 6’ సరదా మాటలతో రుచికరమైన వంటలతో వ్యూయర్స్ లో జోష్ నింపబోతోంది. ఈ నెల 10వ తేదీ రాత్రి 7 గంటలకు ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 6’ ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు, ఆహాలో ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 6’ సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉండనుంది. ఈ రోజు జరిగిన ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 6’ లాంఛ్ ఈవెంట్ లో

ఆహా ఓటీటీ అధికార ప్రతినిధి కవిత మాట్లాడుతూ – చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె మొదలుపెట్టినప్పుడు ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించలేదు. ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా ఆరో సీజన్ కు చేరుకోవడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులంతా ఈ షోను ఎంజాయ్ చేయొచ్చు. సుమ, నందినీ గారి కోసం ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులు చూస్తారని ఆశిస్తున్నా. పాత్ బ్రేకింగ్ షోస్ ను వ్యూయర్స్ కు అందించడంలో ఆహా ముందుంటోంది. ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్ 6 కూడా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.

షో క్రియేటర్ నితిన్ మాట్లాడుతూ – మేము ఏ షో చేసినా ఎంజాయ్ చేస్తూ నిర్వహిస్తాం. 14 ఏళ్లుగా మా జర్నీ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. సుమ, నందినీ గారు, ఆహా లేకుంటే ఈ షో ఇంత బాగా వచ్చేది కాదు. పార్టిసిపెంట్స్ అందరికీ థ్యాంక్స్. ఈ సారి మాతో పాటు శ్రీపాద కూడా క్రియేటర్ గా వర్క్ చేశారు. మాకు సపోర్ట్ గా నిలుస్తున్న ఆహాకు థ్యాంక్స్. అన్నారు.

షో క్రియేటర్ భరత్ మాట్లాడుతూ – అందరు సుమ గారికి, నందినీ గారికి థ్యాంక్స్ చెబుతున్నారు. మేము మాత్రం సారీ చెప్పాలి. ఇలాంటి ఫుడ్ తినిపిస్తున్నందుకు. ఈ షో ద్వారా అందరికీ మంచి ఫుడ్ చూపిస్తాం, మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇస్తామని చెబుతున్నాం. అన్నారు.

కంటెస్టెంట్ కావ్య మాట్లాడుతూ – నేను గతంలో చెఫ్ మంత్రలో పాల్గొని విన్నర్ అయ్యాను. మరోసారి ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా రావడం హ్యాపీగా ఉంది. ఈ సీజన్ 6 మిమ్మల్ని సూపర్బ్ గా ఎంటర్ టైన్ చేస్తుంది. మా షో కు జడ్జ్ లుగా వ్యవహరిస్తున్న సుమ, నందినీ గారికి థ్యాంక్స్. ఇలాంటి మరెన్నో సీజన్స్ రావాలని. మమ్మల్ని కంటెస్టెంట్స్ గా పిలవాలని కోరుకుంటున్నా. అన్నారు.

కంటెస్టెంట్ అర్జున్ అంబటి మాట్లాడుతూ – ఈ షో ప్రతి సీజన్ కు బిగ్ రేంజ్ కు వెళ్తోంది. బాగా ప్రమోట్ చేస్తున్నారు. నేను బ్యాక్ టు బ్యాక్ సీజన్స్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ సీజన్ 6 మరింతగా సబ్ స్క్రైబర్స్ ను ఆకట్టుకుంటుంది. సుమ, నందినీ గారు తమ బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి ఈ షోకు జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. అన్నారు.

కంటెస్టెంట్ రీతు చౌదరి మాట్లాడుతూ – అస్సలు కుకింగ్ రాని నన్ను, విష్ణు ప్రియను ఒక పెయిర్ గా పెట్టారు. మేము చేసిన వంటలను సుమ, నందినీ గారు భరిస్తున్నందుకు థ్యాంక్స్. ఈ షోలో పాల్గొనే అవకాశం కల్పించిన ఆహా టీమ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.

డైరెక్టర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ – నేను రియాల్టీ షోస్ చూడటం తక్కువ. నితిన్, భరత్ గురించి తెలుసుకున్న తర్వాత వాళ్లు రియాల్టీ షోస్ లో రాజమౌళి లాంటి వాళ్లని తెలిసింది. అరవింద్ గారు, సుమ గారి వల్లే ఈ షో కు వచ్చాను. ఇది నాకు కొత్త ఎక్సిపీరియన్స్. నేనే వీళ్లందరిలో జూనియర్ ను. నాకు రోజూ కొత్త విషయాలు నేర్పిస్తూ షో లో పాల్గొనేలా చేస్తున్నారు. మా కంటెస్టెంట్స్ చేసే రెసిపీలు, వేసే పంచ్ లు, సరదా మాటలు..అన్నీ ఎంజాయ్ చేస్తున్నాను. సుమ గారితో కలిసి ఈ షో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అన్నారు.

యాంకర్ సుమ మాట్లాడుతూ – గత ఐదు సీజన్స్ లో ఈ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నాను. ఇప్పుడు ఆరో సీజన్ కు కూడా నేనే ఆ బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉంది. ఈసారి నాతో పాటు నందినీరెడ్డి గారిని తీసుకొచ్చాను. ఆమె నేను ఈ షో చేయలేను చెప్పినా, మీరు చేయగలరు అని ఒప్పించి తీసుకొచ్చాను. ఈ షో లో వంటలు చేసే కంటెంస్టెంట్స్ లో ఏమాత్రం వంటలు తెలియవు. అలాంటి వారినే కావాలని సెలెక్ట్ చేస్తున్నారు. ఇక మా చెఫ్ మంత్రను యూఎస్ లో తెలుగు వారికి చేర్చిన ఘనత రామ్మోహన్, కవిత, హరిప్రియ, శ్రావణికు దక్కుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి కంటెస్టెంట్ కు హార్టీ కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.