‘సీతా పయనం’ నుంచి ఎనర్జిటిక్, మాస్ సాంగ్ ‘బసవన్న’ విడుదల
మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త సినిమా 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషిస్తున్నారు. అయితే యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా పాత్రను పరిచయం చేస్తూ వదిలిన ‘బసవన్న’ పాట ఎంతో అద్భుతంగా ఉంది. ఇందులో బసవన్నగా ధ్రువ…
