“రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్
*బాబు మోహన్ గారికి "రేలంగి అవార్డు" వచ్చిన సందర్భంగా పద్మశ్రీ అవార్డు రావాలి : సినీ ప్రముఖులు* తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు, మాజీ మంత్రి, విశ్వ నట సామ్రాట్ డాక్టర్ బాబు మోహన్ గారికి తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత రేలంగి అవార్డు వచ్చిన సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది. సుమారు 2000 చిత్రాలలో నటించి ఆయనకు ఉన్న సామాజిక స్పృహతో రాజకీయాలలో అడుగు పెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా కేబినెట్ లో సేవలు అందించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ…
