Skip to content

‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరిస్తుంది: హీరో, నిర్మాత ఫహద్ ఫాసిల్

నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల మలయాళంలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న తెలుగులో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత, హీరో ఫహద్ ఫాసిల్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో నేను హైదరాబాద్‌కు తరచూ వస్తున్నాను. ఇది నాకు నా సొంత ఊరులా మారింది. ఇక్కడి ప్రేక్షకుల ప్రేమ, అభిమానం నాకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తున్నాయి. ‘ప్రేమలు’తో తెలుగు ప్రేక్షకులతో మా అనుబంధం మరింత బలపడింది. ఆ సినిమాకు ప్రేక్షకులు గొప్ప సపోర్ట్ ఇచ్చారు. ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ కూడా చాలా మంచి సినిమా. నివిన్ పౌలీ, మమితా బైజు, టీమ్ అందరూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. గిరీశ్ ఏడీ మంచి రొమాంటిక్ కామెడీ సినిమా అందించారు. మలయాళంలో ఈ సినిమా అద్భుతంగా రాణిస్తోంది. ఈ సినిమాను తెలుగులోకి తీసుకొస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ రవి, నవీన్ గారికి థాంక్యూ. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. మీ అందరి సపోర్ట్ కావాలి.

హీరో నివిన్ పౌలీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. తెలుగులో రిలీజ్ అవుతున్న నా ఫస్ట్ ఫిల్మ్. తెలుగు ఆడియన్స్ ముందుకు ఈ సినిమాను తీసుకొస్తున్న మైత్రీ మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు. ఇది చాలా మంచి రొమాంటిక్ కామెడీ సినిమా. మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను.

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నైజాంలో మేము మలయాళం వెర్షన్ రిలీజ్ చేశాము. ఆ మలయాళం వెర్షన్ దాదాపు 60 లక్షలు గ్రాస్ చేసింది. అది మామూలు నెంబర్ కాదు. దీంతో మేము తెలుగులో కూడా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాము. తెలుగులో కూడా ఇది సెన్సేషన్ చేస్తుంది. మనకి ‘ఇరుముడి’ లాగా ఈ సినిమా మలయాళంలో 200 కోట్లు కలెక్ట్ చేసింది. మమితా నుంచి వరుసగా సూపర్‌హిట్ సినిమాలు వస్తున్నాయి. సినిమాలన్నీ అద్భుతమైన రికార్డులు క్రియేట్ చేస్తాయి. ఫాజిల్ గారు మా హీరో. ఆయనతో కూడా మేము కలిసి సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అవుతుంది. మీరు సెప్టెంబర్ 4న థియేటర్‌లో కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమా మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అదే హిట్ ఇక్కడ కూడా కొనసాగుతుందని నమ్ముతున్నాము. టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్. నివిన్ గారి ‘బెంగళూరు డేస్’ ప్రేమమ్ సినిమాలు మాకు ఎంతో ఇష్టం. మమిత మా బ్యానర్‌లో సినిమాలు చేసింది. తను నటించిన ప్రతి సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది. అందరూ సెప్టెంబర్ నాలుగున ఈ సినిమాను థియేటర్‌లో చూడాలని కోరుకుంటున్నాను.

డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా మలయాళం వెర్షన్‌లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు నేరుగా తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నాము. కచ్చితంగా ఇది ఫ్యామిలీ అందరూ కలిసి థియేటర్‌లో చూడాల్సిన సినిమా. సెప్టెంబర్ 4న మీరు ఒక సూపర్‌హిట్ సినిమా చూడబోతున్నారు.

డైరెక్టర్ గిరీష్ ఏడీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. తెలుగు ఆడియన్స్ అంటే మాకు చాలా గౌరవం. ‘ప్రేమలు’ సినిమాకు మీరు ఎంతో ప్రేమను ఇచ్చారు. మీకు ఈ సినిమా కూడా నచ్చుతుందని నమ్ముతున్నాను.

శ్యామ్ మోహన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను తెలుగులో ఒక సినిమా చేస్తున్నాను. ‘ప్రేమలు’ సినిమాలో ఆది క్యారెక్టర్‌ను మీరు ఎంతగానో ప్రేమించారు. ఇప్పుడు ఈ సినిమాలో హరి క్యారెక్టర్‌ను కూడా ప్రేమిస్తారని నమ్ముతున్నాను.

సంగీత్ మాట్లాడుతూ.. ‘ప్రేమలు’ సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణకు కృతజ్ఞతలు. రాజమౌళి గారి అప్రిషియేషన్‌తో నిజంగా మా కెరీర్‌లో మరో మలుపు తిరిగింది. ఆ సినిమాకు ప్రేక్షకులు, మీడియా ఇచ్చిన ఆదరణ మర్చిపోలేము. ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ కూడా మీ అందరినీ అలరిస్తుంది. తప్పకుండా ఈ సినిమాను మీరు థియేటర్‌లో చూడాలని కోరుకుంటున్నాను.

ఫ్యూచర్ రన్‌అప్ ఫిల్మ్స్ అరుణ్ నారాయణ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మైత్రీ మూవీ మేకర్స్‌తో అసోసియేషన్ అవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కేవలం కేరళలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. తప్పకుండా తెలుగులో కూడా ఈ సినిమాను ఇష్టపడతారని నమ్ముతున్నాను. మీ అందరి ఆదరణ కావాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో మూవీ యూనిట్ అందరూ పాల్గొన్నారు.

నటీనటులు: నివిన్ పౌలీ, మమిత బైజు, సంగీత్ ప్రతాప్, సురేష్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, రోషన్ షానవాస్, శ్యామ్ మోహన్, షమీర్ ఖాన్, స్రిందా, పార్వతి అయ్యప్పదాస్, మీనాక్షి రవీంద్రన్, శ్రీరంజిని, వినీత్ విశ్వం, బిందు పనికర్, వెట్టుకిలి మంజు, జయంతి సనత్ శివరాజ్

సమర్పణ: మైత్రీ మూవీ రిలీజ్ & ఫ్యూచర్ రన్అప్ ఫిల్మ్స్
దర్శకత్వం: గిరీష్ ఎ డి
నిర్మాతలు: దిలీష్ పోతన్, ఫహద్ ఫాసిల్, శ్యామ్ పుష్కరన్
రచన: గిరీష్ ఎ డి, కిరణ్ జోసీ
సంగీతం: విష్ణు విజయ్
సినిమాటోగ్రఫీ: అజ్మల్ సాబు
ఎడిటర్: ఆకాష్ జోసెఫ్ వర్గీస్
పీఆర్వో: వంశీ శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.