‘రేజర్’ ఇంటెన్స్ & వైల్డ్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
ఫార్ములా కథలకు దూరంగా, కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన రవి బాబు, తన తాజా చిత్రం ‘రేజర్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ఈ రోజు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అవసరంలో ఉన్నవారికి దేవుడు రక్షకుడిగా దేవదూతను పంపుతాడని అంటారు. కానీ మరణం వెంబడిస్తూనే ఉండి, తప్పించుకోవడం అసాధ్యమయ్యే సమయంలో అదే దేవదూత విధ్వంసానికి ప్రతీకగా మారుతుంది. కరుణ మాయమైతే మిగిలేది కేవలం ఆగ్రహం మాత్రమే. తనకు కావాల్సిన వారిని కాపాడేందుకు కోపం, క్రోధం, కలహం, విధ్వంసం.. అన్నీ…
