4న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హైలీ యాంటిసిపేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు', విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్, ఆకట్టుకునే ప్రచార కార్యక్రమాలతో భారీ సంచలనం సృష్టిస్తోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. 'మీసాల పిల్ల' పాట 100 మిలియన్లకు పైగా వ్యూస్ దాటగా, 'శశిరేఖ' పాట దాదాపు 40 మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. చిరంజీవి, వెంకటేష్ నటించిన పాట 'సంక్రాంతి అదిరిపోద్ది' ఒక ఫెస్టివల్ సాంగ్ లా మారింది. 'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్ర బృందం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని…
