‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’లో స్కెలెటర్ కు మూడు వెర్షన్లలో వాయిస్ ఇచ్చిన ఆదిత్య మీనన్
ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్” జూన్ 5న భారతదేశంలో ఘనంగా విడుదల కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రముఖ విలన్ పాత్ర స్కెలెటర్‌కు హిందీ వెర్షన్‌లో ప్రముఖ నటుడు జావేద్ జాఫ్రీ వాయిస్ అందిస్తుండగా, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ తన గాత్రాన్ని అందించడం విశేషం. ఈ సందర్భంగా ఆదిత్య మీనన్ మాట్లాడుతూ, “హీ-మ్యాన్ ఫ్రాంచైజీతో నాకు చిన్ననాటి నుంచి ఎంతో అనుబంధం ఉంది. స్కెలెటర్ వంటి ఐకానిక్ విలన్‌కు మూడు భాషల్లో డబ్బింగ్…
