మైక్రో ఫైనాన్స్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు – గాయని మంగ్లీ
మైక్రో ఫైనాన్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని గాయని మంగ్లీ తెలిపింది. తనకు డబ్బు ఆశ లేదని, పాటలే తన ప్రపంచమని మంగ్లీ చెప్పారు. ఈ కేసులో తన సోదురుడికి కూడా ఎలాంటి ఇన్వాల్వ్ మెంట్ లేదని ఆమె అన్నారు. న్యాయవాది సుబ్బు ప్రచారం కోసం, పాపులర్ అయ్యేందుకు తనపై కేసు పెట్టారని మంగ్లీ అన్నారు. మైక్రో ఫైనాన్స్ కేసు విషయంలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంగ్లీ, ప్రెస్ మీట్ లో ఉద్వేగానికి లోనయై కన్నీళ్లు పెట్టుకున్నారు. గాయని మంగ్లీ మాట్లాడుతూ - మైక్రో ఫైనాన్స్ కేసులో నా పేరు, నా సోదరుడు పేరును మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం నాకు తెలిసినప్పుడు బెంగళూరులో ఒక ప్రోగ్రాం లో…
