Skip to content

సుజయ్ ప్రొడక్షన్స్ & అర్ఎన్ క్రియేషన్స్ చిత్రం ప్రారంభం

యష్ తేజ్, జయశ్రీ జంటగా సుజయ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో అర్ఎన్ క్రియేషన్స్ సమర్పణలో చందు దర్శకత్వంలో కె గోపాల్, జె రవీందర్ నిర్మాతలుగా తెరకెక్కబోతున్న ప్రేమకథ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

ఈ కార్యక్రమంలో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కెమెరా స్విచ్ ఆన్ చెయ్యగా ముహూర్తం సన్నివేశానికి దర్శకుడు విఎన్ ఆదిత్య క్లాప్ కొట్టారు అలాగే మామిడి హరికృష్ణ స్క్రిప్ట్ ను చిత్ర యూనిట్ కు అందజేశారు.

ప్రేమించుకొనే యువత తల్లి తండ్రులని దృష్టిలో ఉంచుకుంటే ఏం జరుగుతుంది? ప్రేమలో ఉన్న అబ్బాయి అమ్మాయి వారి పేరెంట్స్ గురుంచి ఎలా ఆలోచిస్తారు? వంటి సంఘటనలతో ఈ సినిమా కథాంశం ఉంటుందని దర్శకుడు చందు చెబుతున్నారు

ఒక సరికొత్త ప్రేమను తెరమీద ఆవిష్కరించబోతున్నందుకు ఆనందంగా ఉందని నిర్మాతలు కె గోపాల్, జె రవీందర్ తెలిపారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ భూపతి యాదగిరి, సంగీతం నాగ వంశీ, సినిమాటోగ్రఫీ నాని బిశెట్టి, సురేష్ జిల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎర్రం రామకృష్ణ

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.