Skip to content

ఓజీ’ లో బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా ఉంటాయి: ప్రియాంక అరుళ్ మోహన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ఓజీ'. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజాస్‌ గంభీరగా పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న 'ఓజీ' చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలో ట్రైలర్ విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఈ నేపథ్యంలో తాజాగా కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్…

Read more

షణ్ముఖ్‌ జస్వంత్‌ ‘ప్రేమకు నమస్కారం’ టైటిల్‌ గ్లింప్స్‌ విడుదల

కొత్తదనంతో కూడిన చిత్రాలను మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అందుకే మన దర్శక, నిర్మాతలు ఇప్పుడు న్యూ కాన్సెప్ట్‌ చిత్రాలను నిర్మించడానికి ఇష్టపడుతున్నారు. ఇక ఇప్పుడు సోషల్‌మీడియాలో, యూట్యూబ్‌లో సన్సేషన్‌ సృష్టించిన వారు వెండితెరకు పరిచయమవుతున్నారు. సక్సెస్‌ సాధిస్తున్నారు. ఇటీవల లిటిల్‌హార్ట్స్‌ చిత్రంతో యూట్యూబ్‌ సన్సేషన్‌, మీమ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ మౌళి తనూజ్‌ బ్లాక్‌బస్టర్‌ అందుకున్నాడు. ఇప్పుడు ఈ కోవలోనే యూట్యూబ్‌లో వీడియోలతో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్‌ను క్రియేట్‌ చేసుకున్న యూట్యూబ్‌ సన్సేషన్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. ఉల్క గుప్తా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు శివాజీ, ప్రముఖ నటి భూమిక కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. ఏబీ సినిమాస్‌ పతాకంపై అనిల్‌ కుమార్‌ రావాడ,…

Read more

అమోజాన్ ప్రైమ్ , ఆహా ఓటీటీలో “కన్యాకుమారి”

గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ హీరో హీరోయిన్లుగా నటించిన "కన్యాకుమారి" మూవీ అమోజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లో ఈ నెల 17వ తేదీ (రేపటి నుంచి) స్ట్రీమింగ్ కు వస్తోంది. ఈ సినిమాను మధుశాలినీ సమర్పణలో దర్శకుడు సృజన్ తన రాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే బ్యూటిఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుందీ సినిమా. ఆనంద్ దేవరకొండ హీరోగా పుష్పక విమానం చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సృజన్ "కన్యాకుమారి"తో మరో మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. ఈ చిత్రంలో శ్రీకాకుళం అమ్మాయిగా గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ పర్ ఫార్మెన్స్ లకు మంచి పేరొచ్చింది. గత నెల 27న థియేటర్స్ లోకి…

Read more

ఘనంగా ‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌

ఎస్ వి ఎస్ ప్రొడక్షన్స్ శ్రీనిధి సినిమాస్ బ్యానర్స్ పై జాతీయ అవార్డు గ్రహీత నరసింహా నంది రచన దర్శకత్వంలో రానున్న చిత్రం ప్రభుత్వ సారాయి దుకాణం. దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మాతలుగా మురళీమోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీలో నాగిరెడ్డి ఎడిటింగ్ చేస్తూ సిద్ధార్థ్ సంగీతాన్ని అందించారు. సదన్ హాసన్, విక్రమ్ జిత్, నరేష్ రాజు, వినయ్ బాబు హీరోలుగా శ్రీలు దాసరి, అదితి మైకేల్, మోహన సిద్ధి హీరోయిన్లుగా ప్రధాన పాత్రలు పోషించారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, బిజేపి బాలు నాయక్, రంగరాజు, తిలక్, బలగం సహదేవ్, స్వప్న, జ్యోతి తదితరులు కీలకపాత్రల పోషించారు. మల్లిక్, నరేష్ గౌడ్ ఈ చిత్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న పాటలు…

Read more

పరిపూర్ణ రచయితగా ఎదగాలనేది నా బలమైన కోరిక : ప్రముఖ గీత రచయిత శ్రీమణి

'100 పర్సెంట్‌ లవ్‌' చిత్రంతో తో గీతరచయితగా పరిచయమైన శ్రీమణి. తెలుగు సినీ పరిశ్రమలో పాటల రచయితగా తనకంటూ ఓ గుర్తింపు సంపాందించుకున్నారు. ఎన్నో అగ్రశ్రేణి చిత్రాలకు, స్టార్‌హీరో చిత్రాలకు గేయ రచయితగా పనిచేశారు శ్రీమణి. అనతికాలంలోనే టాప్‌ లిరిక్‌ రైటర్స్‌ల్లో ఒకరిగా పేరుపొందిన ఈ యువ గీత రచయిత పుట్టినరోజు సెప్టెంబరు 15 ( సోమవారం). ఈసందర్భంగా తన కెరీర్‌ విషయాలను మీడియాతో పంచుకున్నారు శ్రీమణి. ఆ విశేషాలివి. ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏమైనా ఉందా? ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. కాకపోతే నా సాహిత్యపు జర్నీలో మరో మెట్టు ఎక్కాలని.. కొత్త అఛీవ్‌మెంట్‌ సాధించాలి అదే నా లక్ష్యం. ఈ రోజే నా లైఫ్ మొదలైంది అనే భావనతో కొత్త…

Read more

మిరాయ్ చాలా సంతోషాన్ని ఇచ్చింది: మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర

సూపర్ హీరో తేజ సజ్జా బ్రహ్మాండం బ్లాక్ బస్టర్ ‘మిరాయ్‌’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్‌ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజైన ఈ చిత్రం బ్రహ్మాండం బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకుని అద్భుతమైన కలెక్షన్స్‌తో హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు. హనుమాన్, మిరాయ్ రెండు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా హిట్స్ అందుకున్నారు.. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? -…

Read more

బ్యూటీ సినిమా చూసి డిస్ట్రిబ్యూటర్స్ ఏడ్చారు.. దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

అంకిత్ కొయ్య, నీలఖి హీరో హీరోయిన్లుగా విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’. జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా ‘బ్యూటీ’ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు ‘గీతా సుబ్రమణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ మాటలు, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో నేడు సినిమా దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్ మీడియాతో ముచ్చటించి మీడియా ప్రతినిధులు…

Read more

‘భద్రకాళి’ అందరికీ కనెక్ట్ అవుతుంది: విజయ్ ఆంటోనీ

హీరో విజయ్ ఆంటోనీ 'మార్గన్' విజయం తర్వాత మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌ 'భద్రకాళి'తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కనెక్ట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, రాణా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. 'భద్రకాళి' సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్…

Read more

మన కల్చర్ ను కాపాడుకునేలా వీర చంద్రహాస ఉంటుంది : రవి బస్రూర్

కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్, ఎస్ జే కే బ్యానర్స్ పై ఎమ్‌వీ రాధాకృష్ణ, జేమ్స్ డబ్యూ కొమ్ము తెలుగులో విడుదల చేస్తున్న కన్నడ చిత్రం ‘వీర చంద్రహాస’. మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్‌‌గా రాధాకృష్ణకు గుర్తింపు ఉంది. గతంలో శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’, ప్రజ్వల్ దేవరాజ్ నటించిన ‘రాక్షస’ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేసిన ఆయన.. తాజాగా ‘వీర చంద్రహాస’ తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నారు. సెప్టెంబర్ 19న తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రవి బస్రూర్ మాట్లాడుతూ.."ఇదొక రేటెడ్ స్టోరీ. యక్షగానం…

Read more

శుభప్రదం శ్రీనివాస కల్యాణం

రాజేంద్రనగర్‌ ఉప్పరపల్లిలోని స్వాగత్‌ డిలైట్‌ అపార్ట్‌మెంట్స్‌లో శ్రీనివాస కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. వేదపండితులు పరాశర శ్రీరామ బట్టర్, సముద్రాల శిఖామణి, సముద్రాల శ్రీమన్నారాయణలు ఈ వేడుకని సంప్రదాయబద్దంగా జరిపించారు. ఈ సందర్భంగా వారు భక్తులనుద్దేశించి మాట్లాడుతూ–‘‘శ్రీనివాసుల ప్రేమ వారి కల్యాణంతో సుఖాంతం అయింది. కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి కల్యాణోత్సవం జరిపించడం శుభప్రదం. కోరుకున్న కోర్కెలన్నీ నెరవేరతాయి. కల్యాణోత్సవం జరిపించటం వల్ల అవివాహితులకు మంచి సంబంధాలు కుదిరి శీఘ్రంగా కల్యాణం జరుగుతుంది. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. అలాగే విద్యార్థులకు విద్య బాగా అబ్బుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది.. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. అందుకే శ్రీనివాస కల్యాణం జరిపించటం సంప్రదాయం. ఈ వేడుకలో పాలు పంచుకున్నవారికి, చూసిన…

Read more