Skip to content

National sports Day

Y N R Sports Academy,church GaGiLLAPUR. Dr. Laaksha Naidu has received "AN HONOUR PRESENTATION" In the field of Sports on the occasion of NATIONAL SPORTS DAY from the prestigious YNR SPORTS ACADEMY, CHURCH GAGILLAPUR. This award is presented to Dr.Laaksha Naidu for her achievements in the era of Sports as a "NATIONAL WINNER - WHO WON NATIONALS AS A TEAM CAPTAIN" as well received several other awards in Sports (Volleyball, Basketball, Badminton and others) and also A NATIONAL WINNER at…

Read more

ఘనంగా క్రీడా దినోత్సవం

మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో వారం రోజులుగా క్రీడా దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌ చంద్‌ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు క్రీడా పోటీలు నిర్వహించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్ని ప్రదర్శించారు. క్రీడా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శనివారం నిర్వహించిన ముగింపు వేడుకకి శ్రీచైతన్య స్కూల్స్‌ మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కోరారు. ప్రిన్సిపల్‌ ఎన్‌.స్వాతి మాట్లాడుతూ–‘‘విద్యార్థులకు క్రీడలు ఎంతో అవసరం. క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, ఉత్సాహం కలుగుతుంది. విద్యా వికాసానికి ఆటలు అనేవి దోహద పడతాయి. ప్రతి ఒక్కరూ క్రీడల్లోనూ ప్రతిభ చాటాలి’’ అని చెప్పారు…

Read more

డ్యూడ్’ నుంచి ఫస్ట్ గేర్ బూమ్ బూమ్ రిలీజ్

వరుస బ్లాక్‌బస్టర్‌ విజయాలతో దూసుకుపోతున్న యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ పాన్ ఇండియా మూవీ డ్యూడ్‌తో అలరించడానికి రెడీ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. 'ప్రేమలు' అద్భుతమైన విజయం తర్వాత ప్రదీప్ సరసన మమిత బైజు నటించగా, శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఫస్ట్ సింగిల్ - బూమ్ బూమ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటని సాయి అభ్యాంకర్ స్వరపరిచి పాడారు. ఎనర్జీటిక్ బీట్స్,ఆకట్టుకునే సాహిత్యంతో ఈ సాంగ్ యూత్ కి అద్భుతంగా కనెక్ట్ అవుతుంది. సేనాపతి భరద్వాజ్ పాత్రుడు లిరిక్స్ చాలా ఫ్రెష్ గా వున్నాయి. దీప్తి సురేష్, భూమిక, సాయితో కలిసి…

Read more

రామ్ చరణ్ గారు మోగ్లీ గ్లింప్స్ లాంచ్ చేయడం గ్రేట్ హానర్- రోషన్ కనకాల

-గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంచ్ చేసిన రోషన్ కనకాల, సందీప్ రాజ్, టిజి విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మోగ్లీ 2025 గ్లింప్స్- గ్లింప్స్ కు నేచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్ బబుల్గమ్ తో సక్సెస్ ఫుల్ గా డెబ్యు చేసిన యంగ్ హీరో రోషన్ కనకాల, తన అప్ కమింగ్ మూవీ మోగ్లీ 2025 లో పూర్తిగా భిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. తన తొలి చిత్రం కలర్ ఫోటోతో జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై విజనరీ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన మోగ్లీ 2025, పోస్టర్లు, పుట్టినరోజు స్పెషల్ గ్లింప్స్ తో…

Read more

లిటిల్ హార్ట్స్ఆకట్టుకుంటుంది – ఆదిత్య హాసన్, సాయి కృష్ణ

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ "లిటిల్ హార్ట్స్". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ "లిటిల్ హార్ట్స్" మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. "లిటిల్ హార్ట్స్" సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ హైలైట్స్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు నిర్మాతలు ఆదిత్య హాసన్,…

Read more

ఘనంగా విశాల్, సాయి ధన్సికల నిశ్చితార్థం

విశాల్, సాయి ధన్సిక నిశ్చితార్థం ఆగస్ట్ 29న ఘనంగా జరిగింది. విశాల్, ధన్సిక ప్రేమ, పెళ్లి గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. విశాల్, ధన్సిక ఇద్దరూ కూడా స్టేజ్ మీదే తమ ప్రేమ, పెళ్లికి సంబంధించిన విషయాల్ని ప్రకటించారు. ముందు చెప్పినట్టుగానే ఆగస్ట్ 29న ఈ ఇద్దరి పెళ్లికి అడుగులు పడ్డాయి. కుటుంబ సభ్యుల సమక్షంలో విశాల్, సాయి ధన్సికల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ మేరకు ఎంగేజ్మెంట్ ఫోటోల్ని విశాల్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో నేడు మా ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.. అందరి ఆశీర్వాదం మాకు కావాలి అంటూ సోషల్ మీడియాలో విశాల్ తాజాగా వేసిన ట్వీట్, షేర్ చేసిన ఫోటోలు…

Read more

సుందరకాండ’ని ఎంజాయ్ చేస్తారు: నారా రోహిత్

హీరో నారా రోహిత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'సుందరకాండ'. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించారు. వృతి వాఘాని, శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్స్ గా నటించారు. ఆగస్టు 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయం సాధించి, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో నారా రోహిత్ మాట్లాడుతూ..అందరికి నమస్కారం. 'సుందరకాండ' కి వచ్చిన అద్భుతమైన రివ్యూలు చాలా ఆనందాన్నిచ్చాయి. థియేటర్స్ వచ్చి చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్ కి థాంక్యూ సో మచ్. సినిమాకి చాలా…

Read more

రవి మోహన్ స్టూడియోస్ గ్రాండ్ లాంచ్

వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న రవి మోహన్ ఇప్పుడు నిర్మాతగా మారారు. ఈ సందర్భంగా రవి మోహన్ స్టూడియోస్ లాంచింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శివ కార్తికేయన్, కార్తీ, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రవి మోహన్ తన “రవి మోహన్ స్టూడియోస్” నిర్మాణ సంస్థను అందరికీ పరిచయం చేశారు. అనంతరం తన ప్రొడక్షన్‌లో రాబోతోన్న రెండు సినిమాల గురించి చెప్పారు. ఈ రెండింటిలో ఓ సినిమాను రవి మోహన్ తెరకెక్కిస్తుండటం విశేషం. రవి మోహన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఆయన స్వీయ దర్శకత్వంలో యోగి బాబు హీరోగా ఓ చిత్రం రానుండగా, దర్శకుడు కార్తీక్ యోగి దర్శకత్వంలో రవి మోహన్,…

Read more

అభిమాని రాజేశ్వరి పట్ల మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయ స్పందన

మహోన్నతమైన వ్యక్తిత్వం, యెనలేని సేవాతత్వంతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరి, మెగాస్టార్ ని కలవాలనే కలతో సైకిల్‌పై హైదరాబాద్‌కు సాహసోపేత ప్రయాణం మొదలుపెట్టారు. ఎన్నో శారీరక, మానసిక సవాళ్లు ఎదురైనా చిరంజీవిపై వున్న అపారమైన అభిమానమే ఆమెను విజయవంతంగా ముందుకు నడిపింది. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, రాజేశ్వరిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఆమె అంకితభావానికి, తనను చేరుకోవడానికి చేసిన కృషికి చలించిపోయిన చిరు, ఒక చిరస్మరణీయ జ్ఞాపకాన్ని ఇచ్చారు. ఆ సందర్భంలో రాజేశ్వరి, మెగాస్టార్ కి రాఖీ కట్టగా, ఆమెకు ఆశీస్సులు అందించి అందమైన సాంప్రదాయ చీరను బహుమతిగా…

Read more

క్యాన్సర్ పేషెంట్ కి యాంకర్ శ్రీనివాస్ సంజయ్ రక్తదానం!

హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్ సంజయ్ మహా న్యూస్ రిపోర్టర్ మరియు యాంకర్ గా పని చేస్తున్నాడు. ఈయన18వ సారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. 18సార్లు అవనిగడ్డ బ్లడ్ డోనర్స్ తరఫున అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేశాడు. మూడు నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేసే అలవాటు ఉన్న సంజయ్ బ్లడ్ అవసరం ఉందన్న సమాచారం తెలిస్తే చాలు రక్త దానం చేసేవాడు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పెడనకు చెందిన అమలేశ్వరి హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది . ఆమెకు అత్యవసరంగా బ్లడ్ అవసరం అవుతుంది డోనర్ కోసం వారి కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న శ్రీనివాస్ సంజయ్ నేనున్నాను అని ముందుకు వచ్చాడు. శుక్రవారం…

Read more