Skip to content

ప్రముఖ నటి పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితిపై ప్రసాద్ హాస్పిటల్స్‌ హెల్త్ బులెటిన్ విడుదల

ప్రముఖ నటి పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితిపై ప్రసాద్ హాస్పిటల్స్‌ హెల్త్ బులెటిన్ విడుదల Telugu News
ప్రముఖ నటి పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితిపై ప్రసాద్ హాస్పిటల్స్‌ హెల్త్ బులెటిన్ విడుదల Telugu News

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి పావలా శ్యామల అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లోని ప్రసాద్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వైద్యులు ప్రాథమిక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 78 ఏళ్ల పావలా శ్యామలకు హైపర్‌టెన్షన్, కరోనా ఆర్టరీ డిసీజ్ (CAD), పార్కిన్సన్స్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. రెగ్యులర్ మెడికేషన్ తీసుకోని పరిస్థితిలో మే 16, 2026 ఉదయం 6:30 గంటలకు తీవ్రమైన కడుపు నొప్పి, రిగర్జిటేషన్, దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యలతో ఆస్పత్రికి వచ్చినట్లు పేర్కొన్నారు.

వెంటనే ఆమెను అడ్మిట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆమెకు “అక్యూట్ సివియర్ గ్యాస్ట్రిటిస్” ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం నిర్వహించిన అల్ట్రాసౌండ్ (USG Abdomen) పరీక్షలో కామన్ బైల్ డక్ట్ (CBD) విస్తరించి ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. దీంతో మరింత స్పష్టమైన వివరాల కోసం CECT Abdomen స్కాన్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం పావలా శ్యామలకు ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్‌తో పాటు అవసరమైన సపోర్టివ్ ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో క్లోజ్ మానిటరింగ్ జరుగుతోందని పేర్కొన్నారు.

మరింత వైద్య పరీక్షలు, పరిశీలన అనంతరం రేపు పూర్తి స్థాయి ఆరోగ్య బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.