Skip to content

‘పెద్ది’ సెకండ్ సింగిల్ రై రై రా రా మార్చి 2న రిలీజ్

‘పెద్ది’ సెకండ్ సింగిల్ రై రై రా రా మార్చి 2న రిలీజ్ Telugu News

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ సినిమా వేసవిలో గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో బజ్ నెక్స్ట్ లెవల్ కి చేసుకుంది. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది భారీ హాలిడే సీజన్ షోడౌన్ కు వేదికగా నిలుస్తోంది. వృద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన పెద్దిలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఫస్ట్ షాట్ గ్లింప్స్, బ్లాక్ బస్టర్ ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి కి ట్రెమండస్ రెస్పాన్స్ తో రికార్డులను బద్దలు కొట్టాయి.
ఎక్సయిట్మెంట్ ని మరింతగా పెంచుతూ మార్చి 2న రెండవ సింగిల్ ‘రై రై రా రా’ విడుదలతో బజ్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళబోతోంది. సాంగ్ పోస్టర్‌లో రామ్ చరణ్ మ్యాసీ అవతార్ లో కనిపిస్తున్నారు. రగ్గడ్ దుస్తులు, చిరిగిన జుట్టు, గడ్డం, భుజంపై పెద్ద సుత్తిని వేలాడదీసుకుని, మెరిసే చిరునవ్వుతో కనిపిస్తున్నారు, బ్యాక్ డ్రాప్ లో గందరగోళం చెలరేగుతున్నప్పటికీ, ప్రజలు అతని చుట్టూ పరిగెత్తుతున్నారు.
AR రెహమాన్ పవర్ ఫుల్ సంగీతం ఇప్పటికే సంచలనం సృష్టించింది. పెద్ది ఈ సంవత్సరం అత్యంత ఎదురుచూస్తున్న మాస్ స్పెషాలిటీలలో ఒకటిగా రాబోతోంది.
ఈ చిత్రంలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఆస్కార్-విజేత స్వరకర్త AR రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ R రత్నవేలు డీవోపీ, జాతీయ అవార్డు గెలుచుకున్న ఎడిటర్ నవీన్ నూలి ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్.
తారాగణం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సాన
సమర్పకులు: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్
నిర్మాత: వెంకట సతీష్ కిలారు
సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా
సంగీతం: ఏఆర్ రెహమాన్
DOP: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
PRO: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.