Skip to content

హీరో ప్రియదర్శి కాంబో మూవీలో హీరోయిన్ గా తెలుగు ఫోక్ సాంగ్స్ ఫేమ్ నాగదుర్గ

హీరో ప్రియదర్శి కాంబో మూవీలో హీరోయిన్ గా తెలుగు ఫోక్ సాంగ్స్ ఫేమ్ నాగదుర్గ Telugu News
Auto Draft Telugu News
Auto Draft Telugu News

ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ప్రియదర్శి హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నారు. ఇటీవల బయటకొచ్చిన ఈ క్రేజీ న్యూస్ మూవీ లవర్స్ లో ఆసక్తి కలిగించింది. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ కాంబో మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమాతో మరో తెలుగమ్మాయి టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. నాగదుర్గ చేసిన అనేక తెలంగాణ ఫోక్ సాంగ్స్ రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించాయి. ప్రియదర్శి, నాగదుర్గ పెయిర్ ప్రేక్షకులకు కొత్తదనం పంచనుంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ సినిమాను యువ దర్శకుడు వంశీ రెడ్డి రూపొందించనున్నారు. ఈ నెల 25న ప్రారంభం కానున్న ఈ మూవీ వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ క్రేజీ కాంబో మూవీ గురించి మరిన్ని డీటెయిల్స్ త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.