Skip to content

తమ కొత్త సినిమా కోసం ఔత్సాహిక నటీనటులకు ఆహ్వానం పలుకుతున్న “రాజు వెడ్స్ రాంబాయి” మేకర్స్

తమ కొత్త సినిమా కోసం ఔత్సాహిక నటీనటులకు ఆహ్వానం పలుకుతున్న “రాజు వెడ్స్ రాంబాయి” మేకర్స్ Telugu News

చిన్న చిత్రంగా రిలీజై పెద్ద విజయాన్ని సాధించింది “రాజు వెడ్స్ రాంబాయి” సినిమా. ఈ మూవీ సక్సెస్ చిన్న చిత్రాల్లో ఎంతో స్ఫూర్తినింపింది. ఇలాంటి బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్న “రాజు వెడ్స్ రాంబాయి” మేకర్స్ మరో కొత్త ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో పుట్టిన మరో మట్టి కథ పరిమళాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఈ చిత్రాన్ని డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, ఆరాధ్య సినీ క్రియేషన్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, సంధ్య భాను చల్లా నిర్మిస్తున్నారు. మధుకర్ రెడ్డి కోమిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ ఇంట్రెస్టింగ్ మూవీలో నటించేందుకు ఔత్సాహిక నటీనటులకు మేకర్స్ ఆహ్వానం పలుకుతున్నారు. ‘తెలంగాణ యాస బాస అచ్చిన తెలుగోళ్ళంతా ఈడియోలు పెట్టుర్రి’ అని ప్రకటించారు. నటన పట్ల ప్యాషన్, ప్రతిభ ఉన్న వారికి ఇదొక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ పంపవద్దని ఈ ప్రకటనలో మేకర్స్ కోరారు. ఆసక్తి గల నటీనటులు వారి వీడియోలను, ఇతర వివరాలను dsf.production02@gmail.com అనే మెయిల్ కు పంపవచ్చు లేదా 8096411437 అనే నెంబర్ కు వాట్సాప్ చేయవచ్చు.

ఇద్దరు అన్నదమ్ముల పంచాయితీ తెలంగాణలోని జమ్మికుంట అనే ఊరు రాతనే ఎలా మార్చింది?, వారిలో ఎవరు గెల్చినా ఊరు మాత్రం ఎందుకు ఓడిపోయింది?, రామాయణంలో రామలక్ష్మణుల్లా కలిసి ఉండాల్సిన అన్నదమ్ములు మహాభారతంలో సోదరుల్లా గొడ్డళ్లు ఎందుకు పట్టుకున్నారు?. ఏ ఇంట్లోనూ జరగకూడని ఈ కథలో అసలు ఏం జరిగింది?. ఈ అన్నదమ్ముల పంచాయితీ ఏందో అంతా కలిసి చూద్దామంటూ కాస్టింగ్ కాల్ లో మేకర్స్ ఇచ్చిన ఆహ్వానం ఆసక్తిని కలిగిస్తోంది.

టెక్నికల్ టీమ్
———————————
బ్యానర్స్ – డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, ఆరాధ్య సినీ క్రియేషన్స్
ప్రొడ్యూసర్స్ – వేణు ఊడుగుల, సంధ్య భాను చల్లా
స్క్రిప్ట్, డైరెక్షన్ – మధుకర్ రెడ్డి కోమిరెడ్డి
పీఆర్ఓ – సురేష్ కొండి

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.