-సరస్వతి లాంటి కథ చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. తప్పకుండా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా…
‘‘రాకాస’ థియేటర్‌కు వచ్చిన వాళ్లని నిరాశపర్చం.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల


ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకున్నారు. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తరువాత జీ స్టూడియోస్ సమర్పణలో నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 3న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో..
నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘పింక్ ఎలిఫెంట్ నుంచి వచ్చే ప్రతీ కంటెంట్‌ను ఆడియెన్స్ ప్రేమిస్తూ, సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ‘రాకాస’ చెప్పిన కథ నాకు వెంటనే నచ్చేసింది. మనందరినీ గతంలోకి తీసుకెళ్లేలా ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీని నిర్మించాను. సినిమా ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నదే నా పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్ లక్ష్యం. ‘రాకాస’తో నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. థియేటర్‌కు వచ్చిన వాళ్లని మాత్రం నిరాశపర్చం. ఈ చిత్రంతో సంగీత్ మరింత షైన్ అవుతాడు. నేను ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి వెళ్లాలని సినిమాలు తీయలేదు. ప్యాషన్‌తో, ప్రేమతో సినిమాల్ని తీస్తున్నాను. అలా ‘కమిటీ కుర్రోళ్లు’ అవార్డుల్ని అందుకుంది. ‘రాకాస’ కూడా అంతే ప్రేమతో, ప్యాషన్‌తో నిర్మించాను. ఎక్కడికి వరకు వెళ్తుందో చూడాలి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌ని నేను మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అందరితో, అన్ని రకాల జానర్ల సినిమాల్ని తీస్తాను.
సంగీత్ శోభన్ మాట్లాడుతూ .. ‘‘నిహారిక, మానస గారి వల్లే ‘రాకాస’ ఈ స్థాయికి వచ్చింది. ఆ ఇద్దరి వల్లే నేను ఈ స్థాయిలో నిలబడ్డాను. ఈ మూవీ కోసం ఆ ఇద్దరూ ఎంతో కష్టపడ్డారు. టీజర్ అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. మానస గారు కథ చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. నిర్మాతగా నిహారిక గారు అని చెప్పడంతో మరింత కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ‘రాకాస’ అందరినీ నవ్విస్తుంది. ఇందులో నాది వన్ మెన్ షో ఉంటుందో లేదో కానీ.. మానస శర్మ గారిది మాత్రం వన్ ఉమెన్ షో లా ఉంటుంది. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్రేక్షకులు పెట్టే టికెట్ డబ్బులకి న్యాయం చేసేలా ‘రాకాస’ ఉంటుంది’ అని అన్నారు.
దర్శకురాలు మానస శర్మ మాట్లాడుతూ .. ‘‘రాకాస’ కోసం మేమంతా చాలా కష్టపడి పని చేశాం. నిహారిక వల్లే నేను దర్శకురాలిగా మారాను. నేను ఆమెకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. సంగీత్ శోభన్ వ్యక్తిగతంగా ఎంతో మంచి వ్యక్తి. సంగీత్‌తో మళ్లీ మళ్లీ పని చేయాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్లందరికీ కూడా డ్రీమ్ యాక్టర్‌గా సంగీత్ నిలుస్తాడు. ఈ కథను నేను మహేష్ ఉప్పల గారితో కలిసి రాశాను. ఏప్రిల్ 3న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
జీ తెలుగు హెడ్ దివ్య మాట్లాడుతూ .. ‘పింక్ ఎలిఫెంట్‌తో కలిసి ‘రాకాస’ని చేయడం ఆనందంగా ఉంది. నిహారికతో కలిసి పని చేయడం మాకు ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. ‘రాకాస’ క్వాలిటీని అందరూ చూస్తున్నారు. ‘రాకాస’ రిలీజ్ కోసం నేను కూడా ఎంతో ఎదురుచూస్తున్నాను. ఏప్రిల్ 3న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుంది’ అని అన్నారు.
సంగీత దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ ..‘‘రాకాస’ సినిమాలో మూడు పాటలుంటాయి. మూవీ రిలీజ్ తరువాత మరో పాటను విడుదల చేస్తాం. పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. ఏప్రిల్ 3న ‘రాకాస’ మూవీని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
నటుడు గెటప్ శ్రీను మాట్లాడుతూ .. ‘నిహారిక గారితో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ చేశాను. ఆ తరువాత మళ్లీ ఇప్పుడు‘రాకాస’ చేస్తున్నాను. మానస శర్మ గారు మళ్లీ నాకు ఓ మంచి పాత్రను రాశారు. అనుదీప్ గారు మంచి సంగీతాన్ని అందించారు. సంగీత్ శోభన్‌తో మళ్లీ పని చేయడం ఆనందంగా ఉంది. మా సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.
నటి రోహిణి మాట్లాడుతూ .. ‘‘రాకాస’ చిత్రం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఇలా అందరూ ఫ్యామిలీతో కలిసి చూసేలా మా సినిమా ఉంటుంది. ఇందులో నాకు మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
నటీనటులు: సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుక్విందర్ సింగ్, అన్నపూర్ణ, అమన్, అనూప్ సింగ్ ఠాకూర్, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, రోహిణి (బజర్దస్త్), రోహన్ (నైంటీస్) తదితరులు
సాంకేతిక వర్గం: బ్యానర్స్: జీ స్టూడియోస్, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ l నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేష్‌కుమార్ బన్సాల్ l కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: మానస శర్మ l ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మన్యం రమేష్ l ఆడిషన్ స్క్రీన్ ప్లే: మహేష్ ఉప్పాల l సంగీతం: అనుదీప్ దేవ్ l సినిమాటోగ్రాఫర్: రాజు ఎదురోలు l యాక్షన్ కొరియోగ్రాఫర్: విజయ్ l ఎడిటర్: అన్వర్ అలీ l ప్రొడక్షన్ డిజైనర్: రామాంజనేయులు l ఆర్ట్ డైరెక్టర్: పుల్ల విష్ణు వర్ధన్ l కాస్ట్యూమ్ డిజైనర్: సంధ్య సబ్బవరపు l పి.ఆర్.ఒ: ఎస్.కె.నాయుడు-ఫణి కందుకూరి (బియాండ్ మీడియా) l ఈవెంట్ పార్ట్‌నర్: యు వి మీడియా l మార్కెటింగ్: టికెట్ ఫ్యాక్టరీ
