Skip to content

“రామ్ చరణ్‌తో నా తొలి సినిమా చేయడం నా అదృష్టం – నిర్మాత వెంకట సతీష్ కిలారు

“రామ్ చరణ్‌తో నా తొలి సినిమా చేయడం నా అదృష్టం  – నిర్మాత వెంకట సతీష్ కిలారు Telugu News
“రామ్ చరణ్‌తో నా తొలి సినిమా చేయడం నా అదృష్టం  – నిర్మాత వెంకట సతీష్ కిలారు Telugu News

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట సతీష్ కిలారు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీ తొలి ప్రొడక్షన్ రామ్ చరణ్ గారు లాంటి పెద్ద హీరోతో చేయడం ఎలా అనిపించింది?
-రామ్ చరణ్ గారు సినిమా ఇవ్వడం నా అదృష్టం. ఆయన ఒప్పుకుంటేనే ఇది సాధ్యపడింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ గారికి ధన్యవాదాలు.

-ఈ సినిమాను మేము అనుకున్న బడ్జెట్‌లో, గ్రాండ్ స్కేల్‌లో అద్భుతంగా తెరకెక్కించాం. తొలి రోజు నుంచి చివరి రోజు వరకు అదే పాజిటివ్ ఎనర్జీతో పని చేశాం. షూటింగ్ చివరి రోజు హీరో గారు, డైరెక్టర్ గారు అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు.

మీ నేపథ్యం గురించి చెప్పండి?
-మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు రైతు. విజయవాడలో చదువుకున్నాను. ఇంజనీరింగ్ తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లోకి వెళ్లాను. నవీన్ గారు నా క్లోజ్ ఫ్రెండ్. ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టం. అలా మేము సినిమాల్లోకి వచ్చాం.

నిర్మాతగా మీరు ఎదుర్కొన్న చాలెంజెస్ ఏమిటి?
-చాలెంజెస్ అనేవి మనం డీల్ చేసే విధానాన్ని బట్టి స్మూత్‌గా మారుతాయి. ఈ సినిమా వరకు మా జర్నీ చాలా హ్యాపీగా సాగింది. తొలి రోజు నుంచి చివరి రోజు వరకు షూటింగ్ చాలా కూల్‌గా జరిగింది. ఎలాంటి పెద్ద చాలెంజెస్ ఎదురుకాలేదు.

బుచ్చిబాబు గారు కథ చెప్పినప్పుడు మీకు ఇందులో నచ్చిన అంశాలు ఏంటి?
-కథ మొత్తం అద్భుతం. సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు ప్రేక్షకులు థియేటర్‌లో కూర్చునే ఉంటారు. కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్… ప్రతిదీ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. ప్రేక్షకుడు సినిమాలో ఏం కోరుకుంటాడో, అవన్నీ ఒక పూర్తి ప్యాకేజ్‌లా బుచ్చిబాబు గారు అందించారు.

చరణ్ గారి గురించి?
-చరణ్ గారు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో మాటల్లో చెప్పలేం. అది స్క్రీన్‌పై చూసినప్పుడే ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ ఎంత అద్భుతంగా ఉందో ప్రేక్షకులకు అర్థమవుతుంది. సినిమా కోసం రెండేళ్ల పాటు ప్రత్యేక ట్రైనర్‌ ని పెట్టుకొని వర్క్ చేశారు. గాయాలను లెక్కచేయకుండా శరీరాన్ని హూనం చేసుకున్నారు. కంటికి కుట్లు వేసుకున్న మరుసటి రోజే షూటింగ్‌కు వచ్చారు. అది ఆయన డెడికేషన్.

-ఇది చాలా ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఉన్న సినిమా. డైరెక్టర్ గారు ఏది చెప్పారో, చరణ్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొన్ని సందర్భాల్లో ఆయన శరీరం సహకరించకపోయినా, ఫిజియో చేయించుకుని వెంటనే షూట్‌కు రెడీ అయ్యేవారు. ఆయన పడిన కష్టం ప్రేక్షకులు బిగ్ స్క్రీన్‌పై చూడబోతున్నారు. షూటింగ్ జరిగినన్ని రోజులు నేను సెట్‌లోనే ఉండేవాడిని.

ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ గురించి?
-ఏఆర్ రెహమాన్ గారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. బుచ్చిబాబు గారు కథ అనుకున్నప్పుడే రెహమాన్ గారి పేరును ఫిక్స్ చేసుకున్నారు. ఆయన కథ విన్న తర్వాత మాకంటే ఎక్కువ ఎక్సైట్ అయ్యారు. ఈ సినిమా కోసం మా కంటే ఎక్కువగా ఆయన పని చేశారు. ప్రతి విషయాన్ని చాలా డీటైల్‌గా కంపోజ్ చేశారు. ఆయన సపోర్ట్‌ను మర్చిపోలేం. అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. పాటలన్నీ ఎంత అద్భుతంగా జనాల్లోకి వెళ్లాయో మనందరం చూశాం.

సినిమా బిజినెస్ ఎలా జరుగుతోంది?
-బిజినెస్ మొత్తం క్లోజ్ అయిపోయింది. చాలా ప్రశాంతంగా ఉన్నాం.

ఇప్పటికే సినిమా చుట్టూ భారీ అంచనాలు ఉన్నాయి కదా.. ట్రైలర్ ఎలా ఉంటుంది?
-ట్రైలర్ వచ్చిన తర్వాత అంచనాలు మరింత పెరుగుతాయి. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా వాటిని మించేలా సినిమా ఉంటుంది. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు వెంటనే సినిమా చూడాలని అనుకుంటారు. టైటిల్ కార్డ్స్ పడినప్పటి నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులు సీట్ నుంచి కదలలేరు. అంత ఫుల్ ప్యాక్డ్‌గా సినిమా ఉంటుంది. ‘పెద్ది’ని చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా, ఓవర్సీస్‌లో సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుంది.

‘పెద్ది’లో సుకుమార్ గారి ఇన్వాల్వ్‌మెంట్ ఉందా?
-సుకుమార్ గారి ఇన్వాల్వ్‌మెంట్ ఉందని నేను అనుకోవడం లేదు. కథ నుంచి మొత్తం బుచ్చిబాబు గారే చూసుకున్నారు. కథ విషయంలో ముందుగా ఆయన గురువుగారు సుకుమార్ గారితో షేర్ చేసుకుని ఉండొచ్చు ఏమో కానీ షూటింగ్ మొదలైన తర్వాత మొత్తం బుచ్చిబాబు గారే చూసుకున్నారు.

శివరాజ్ కుమార్ గారి గురించి?
-శివరాజ్ కుమార్ గారు, జగపతిబాబు గారు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, టీను ఆనంద్… ఇలా ప్రతి క్యారెక్టర్ కథతో బలంగా ముడిపడి ఉంటుంది. ఆ పాత్రల్లో వాళ్లు జీవించేశారు. ప్రతి క్యారెక్టర్ ఇంపాక్ట్‌ను ప్రేక్షకులు బలంగా ఫీల్ అవుతారు.

డీవోపీరత్నవేలు గారి గురించి?
-రత్నవేలు గారు ది బెస్ట్ విజువల్స్ ఇచ్చారు. ఇది 80ల బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ. మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ అద్భుతమైన సెట్లు వేశారు. ‘పెద్ది’ కోసం ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించారు. శ్రీలంక, పూణే, ఢిల్లీ వంటి రియల్ లొకేషన్స్‌లో కూడా షూట్ చేశాం.

రిలీజ్‌కు ముందు చాలా కూల్‌గా కనిపిస్తున్నారు?
-మా కంటెంట్‌పై చాలా నమ్మకం ఉంది. అదే మాకు కాన్ఫిడెన్స్ ఇస్తోంది. ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో ఎక్సైట్మెంట్ మరింత పెరుగుతుంది.

నెక్స్ట్ చేయబోయే సినిమా గురించి?
-బాలకృష్ణ గారితో సినిమా నడుస్తోంది.