Skip to content

‘వంద దేవుళ్ళు’ నుంచి మెలోడీ గీతం ‘రీంగారా.. రీంగారా’ విడుదల

‘వంద దేవుళ్ళు’ నుంచి మెలోడీ గీతం ‘రీంగారా.. రీంగారా’ విడుదల Telugu News
‘వంద దేవుళ్ళు’ నుంచి మెలోడీ గీతం ‘రీంగారా.. రీంగారా’ విడుదల Telugu News

విజయ్ ఆంటోని హీరోగా శశి దర్శకత్వంలో వచ్చిన ‘బిచ్చగాడు’ ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఇన్నేళ్ల తరువాత మళ్లీ ‘బిచ్చగాడు’ మ్యాజిక్ రిపీట్ చేసేందుకు ‘వంద దేవుళ్ళు’ అనే సినిమాతో విజయ్ ఆంటోనీ, శశి ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.

ఇక ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా మదర్ సెంటిమెంట్‌తో సాగే ‘అమ్మ అమ్మేగా’ అనే పాట అందరినీ కదిలించింది. ఇక ఇప్పుడు ఒక రొమాంటిక్, మెలోడీ గీతాన్ని రిలీజ్ చేశారు. ఈ పాటలో లిజమోల్ జోస్, అజయ్ ధీషాన్ జంట ఆకట్టుకుంటోంది. ‘రీంగారా’ అంటూ సాగే ఈ పాటను భాష్య శ్రీ ఎంతో అద్భుతంగా రాశారు. ఆయన సాహిత్యం ఎంతో వినసొంపుగా ఉంది. బాలాజీ శ్రీరామ్ బాణీ ఎంతో శ్రావ్యంగా ఉంది. సంతోష్ హరిహరణ్, మానసి జి కణ్ణన్ ఆలపించిన ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది.

ఈ సినిమాకి ఎస్. బి. దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పని చేశారు. హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా, భాష్య శ్రీ డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు. ఈ మూవీని సమ్మర్ కానుకగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

నటీనటులు : విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్
సమర్పణ : ఫాతిమా విజయ్ ఆంటోని
నిర్మాత : రామంజనేయులు జవ్వాజి
దర్శకుడు : శశి
సంగీతం : బాలాజీ శ్రీరామ్
డీఓపీ : ఎస్. బి. దర్శన్ కిర్లోష్
ఎడిటర్ : హరిష్ యువరాజ్
మాటలు : భాష్య శ్రీ
పీఆర్వో : సాయి సతీష్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.