‘వంద దేవుళ్లు’ ఆగస్ట్ 7 నుంచి జీ5లో స్ట్రీమింగ్
నిజ ఘటనల ఆధారంగా తల్లీ కొడుకల మధ్య అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించిన దర్శకుడు శశి డిఫరెంట్ మూవీస్‌తో ప్రేక్షకుల హృదయాల్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ డ్రామా ‘వంద దేవుళ్లు’. తమిళంలో ‘నూరు సామి’గా రిలీజైంది. ‘బిచ్చగాడు’(పిచ్చైకారణ్) సినిమా విడుదలైన 10 సంవత్సరాలవుతుంది. ఆ సినిమా తర్వాత విజయ్ ఆంటోని, డైరెక్టర్ శశి కాంబోలో వచ్చిన సినిమా ఇది. భావోద్వేగ కుటుంబ కథా చిత్రంగా ఇది తెరకెక్కింది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై విజయ్ ఆంటోనీ, ఫాతిమా విజయ్ ఆంటోని ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం Zee5లో తెలుగు, తమిళ, కన్నడ,…
