'రా కింగ్' మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా "డేవిడ్ రెడ్డి". ఈ సినిమాను వెల్వెట్…
మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’

▪️మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఆకట్టుకోనున్న ‘త్రికాల’
▪️ హై క్వాలిటీ VFXతో గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్
▪️ ట్రైలర్, పాటలతో సినిమాపై భారీ అంచనాలు
▪️ చాగంటి ప్రొడక్షన్ LLP సమర్పణలో వరల్డ్‌వైడ్ రిలీజ్
▪️ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ
భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ మే 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ శ్రద్ధదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించగా, రాధిక–శ్రీనివాస్ నిర్మించారు. ఈ సినిమా నచ్చడంతో చాగంటి ప్రొడక్షన్ LLP ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నది.
ఇటీవలి కాలంలో మైథలాజికల్ టచ్‌తో వచ్చిన థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండటంతో ‘త్రికాల’పై కూడా ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన హైక్వాలిటీ VFX ఈ సినిమాకు ప్రధాన బలం కానుందని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార చిత్రాలు, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మాస్టర్ మహేంద్రన్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అజయ్ పవర్ఫుల్ పాత్ర, శ్రద్ధాదాస్ కొత్త లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
ఈ సందర్భంగా దర్శకుడు మణి తెల్లగూటి మాట్లాడుతూ…
“ప్రపంచంపై చీకటి కమ్ముకున్న సమయంలో వెలుగుగా అవతరించే శక్తి చుట్టూ ‘త్రికాల’ కథ తిరుగుతుంది. భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మిళితం చేసి తెరకెక్కించాం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేక్షకులకు ‘త్రికాల’ ఒక కొత్త అనుభూతిని అందిస్తుందనే నమ్మకం ఉంది” అని తెలిపారు.
నిర్మాతలు మాట్లాడుతూ…
“సరికొత్త కాన్సెప్ట్‌తో, మైథలాజికల్ టచ్‌తో రూపొందిన ‘త్రికాల’ ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సంస్కృతి, ఆధ్యాత్మికత, ఆసక్తి.. వంటి అంశాలు కలిసిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్ ఇస్తుంది” అని పేర్కొన్నారు.
ఈ సినిమాకు హర్షవర్ధన్ రమేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. అర్జున్ రెడ్డి , అనిమల్, స్పిరిట్ వంటి హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన హర్షవర్ధన్ రమేశ్వర్.. ‘త్రికాల’కు కూడా మంచి మ్యూజిక్ అందించారు.
ఇప్పటికే ఈ చిత్రానికి నార్త్ ఇండియాలో కూడా మంచి బిజినెస్ జరిగింది. హిందీ శాటిలైట్ హక్కులతో పాటు డబ్బింగ్ రైట్స్ ఫ్యాన్స్ రేటుకు అమ్ముడుపోయింది.
టాలీవుడ్లో శ్రద్ధదాస్ ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో హీరోయిన్గా పరిచయమై, తరువాత Arya 2 ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. అనంతరం ‘గుంటూరు టాకీస్’, ‘ఏక్ మినీ కథ’, ‘డిక్టేటర్’, ‘నాగవల్లి’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ‘త్రికాల’తో మరోసారి విభిన్నమైన పాత్రలో కనిపించబోతోంది.
మొత్తంగా మైథలాజికల్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన ‘త్రికాల’ మే 29న ప్రేక్షకుల ముందుకు రానుండటంతో సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
నటీనటులు:
శ్రద్ధదాస్ , మాస్టర్ మహేంద్రన్, అజయ్, ఆమని, సాహితి అవంచ, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి తదితరులు.
సాంకేతిక విభాగం:
సమర్పణ, విడుదల: చాగంటి ప్రొడక్షన్ LLP
నిర్మాతలు: రాధిక–శ్రీనివాస్
సహ నిర్మాతలు: శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి
కథ, దర్శకత్వం: మణి తెల్లగూటి
డీవోపీ: పవన్ చెన్న
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: షాజిత్ హుమాయున్
పీఆర్ఓ: అశోక్ దయ్యాల


