మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా 'పెద్ది' తో బాక్సాఫీస్‌ను…
“ఆర్ కే దీక్ష” ఏప్రిల్ మొదటి వారంలో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్

ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శక నిర్మాతగా డి ఎస్ రెడ్డి సమర్పణలో ఢీ, జోడి ఫేమ్ అక్సఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్ గా, కిరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం “ఆర్ కే దీక్ష”. ఈ చిత్రంలో తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ ఇతర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆర్ కే దీక్ష” సినిమాను ఏప్రిల్ మొదటి వారంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో
దర్శకనిర్మాత డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – మా “ఆర్ కే దీక్ష” సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో మా చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. సిటీలోనే వంద స్క్రీన్స్ లో మా మూవీని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. దీక్ష, పట్టుదల ఉంటే ఎవరైనా జీవితంలో ఏదైనా సాధించగలరు అని చెప్పే మంచి సందేశంతో మా మూవీని రూపొందిస్తున్నాం. అక్సాఖాన్ డ్యాన్సర్ క్యారెక్టర్ లో కనిపించనుంది. ఆమె ప్రియుడిగా సైకో క్యారెక్టర్ లో జమ్మూ కాశ్మీర్ కు చెందిన రోహిత్ శర్మ నటిస్తున్నారు. ఆయన ఈ సినిమాతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంటారు. మా చిత్రంలో రాజ్ కిరణ్ మ్యూజిక్ చేసిన ఐదు పాటలు హిట్టయ్యాయి. మధు ప్రియ 3 పాటలు, గీతా మాధురి ఒక పాట పాడారు. ఈ పాటలన్నీ ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్నాయి. కిరణ్ హీరోగా నటిస్తున్నాడు. ఆయన ఈ మూవీలో భీముడి పాత్రలో చెప్పిన నాన్ స్టాప్ 1 మినిట్ డైలాగ్ హైలైట్ అవుతుంది. మా సంస్థలో నెక్ట్స్ మహిళా కబడ్డీ మూవీ నిర్మిస్తున్నాం. ఆ సినిమా విశేషాలు ఇటీవలే ప్రెస్ మీట్ లో చెప్పాం. దీక్ష సినిమా రిలీజ్ అయ్యాక మహిళా కబడ్డీ మూవీ స్టార్ట్ చేస్తాం అన్నారు.
నటుడు రోహిత్ శర్మ మాట్లాడుతూ – నేను జమ్ము కాశ్మీర్ నుంచి వచ్చాను. ఈ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతుండటం సంతోషంగా ఉంది. డా. ఆర్కే గౌడ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాలో అక్సాఖాన్ ప్రియుడి పాత్రలో నటిస్తున్నాను. డ్యాన్సర్ గా ఎదగాలని ప్రయత్నించే ఆమెను వేధించే సైకో లవర్ గా కనిపిస్తాను. ఈ సినిమాతో నటుడిగా నాకు మంచి గుర్తింపు దక్కుతుందని ఆశిస్తున్నా అన్నారు.
నటి తులసి మాట్లాడుతూ – నేను ఈ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించాను. ఈ మూవీలో అక్సాఖాన్ చేసిన పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. హీరోగా కిరణ్ , విలన్ గా రోహిత్ శర్మ తమ నటనతో మెప్పిస్తారు. అక్సాఖాన్ చేసిన స్పెషల్ సాంగ్ కూడా ఈ మూవీకి అట్రాక్షన్ అవుతుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.
నటీనటులు : కిరణ్, అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి, తులసి, అనూష,కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు.
టెక్నికల్ టీమ్:
దర్శక నిర్మాత : డా. ప్రతాని రామకృష్ణ గౌడ్
సమర్పకులు : డీఎస్ రెడ్డి
బ్యానర్స్ : ఆర్ కె ఫిలిమ్స్ , సిగ్ధ క్రియేషన్స్
సంగీతం : రాజ్ కిరణ్
ఎడిటర్ : మేఘన శ్రీను
ఫైట్స్ : రవి
డాన్స్ : ఆనంద్
పిఆర్ఓ : చందు రమేష్
