Skip to content

109 సెంటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ‘మన శంకరవరప్రసాద్ గారు ’

109 సెంటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ‘మన శంకరవరప్రసాద్ గారు ’ Telugu News

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాను మాస్-ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో తిరుగులేని రాజు అని నిరూపించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మితా కొణిదెల నిర్మించిన ఆయన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా, ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపించే 50 రోజుల థియేట్రికల్ రన్ సాధించింది. ప్రస్తుతం OTT ప్రభావంతో థియేటర్ రన్స్ తగ్గిపోతున్న పరిస్థితుల్లో కూడా, ZEE5లో విడుదలైన తర్వాత కూడా ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది.

OTT ప్లాట్‌ఫారమ్ ZEE5 లో కూడా MSG ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి, పలు భాషల్లో నెంబర్ 1 ట్రెండింగ్‌గా కొనసాగడం ప్రజాదరణకు నిదర్శనం.

ఈ చిత్రం రీజినల్ స్థాయిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. చిరంజీవి, అనిల్ రావిపూడి కెరీర్‌లో తొలి 400 కోట్ల బ్లాక్‌బస్టర్‌గా రికార్డు సృష్టించింది. ఉత్తర అమెరికాలో దాదాపు 3.5 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి గ్లోబల్ మార్కెట్‌లో కూడా తన పవర్ ని చాటింది. అలాగే బుక్‌మైషోలో 3.8 మిలియన్లకు పైగా టికెట్లు అమ్ముడవడం రీజినల్ సినిమాల్లో హయ్యస్ట్ రికార్డ్.

ఈ విజయానికి ప్రధాన కారణం చిరంజీవి రిఫ్రెషింగ్, ఎనర్జిటిక్ అవతార్. ఆయన లైవ్లీ ఎక్స్‌ప్రెషన్స్, యూత్‌ఫుల్ ఎనర్జీ, అద్భుతమైన కామిక్ టైమింగ్ ప్రేక్షకులను మళ్లీ గోల్డెన్ ఎరా గుర్తు చేస్తూ అలరించారు.

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కు పేరుపొందిన అనిల్ రావిపూడి మరోసారి అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకునే క్లాసిక్‌ను అందించారు. పండుగ సీజన్‌లో ఫ్యామిలీస్ మెయిన్ చాయిస్ గా నిలిచిన ఈ చిత్రం ఫీల్ గుడ్ నేరేటివ్‌తో ప్రత్యేక స్థానం సంపాదించింది.

కీలక పాత్రలో విక్టరీ వెంకటేష్ నటించడం, అలాగే కమాండింగ్ పాత్రలో నయనతాక కనిపించడం సినిమాకు మరింత వాల్యుని జోడించింది.

ఎక్స్ ట్రార్డినరీ 50 రోజుల ఫీట్ ఈ చిత్రానికి వివిధ ప్రాంతాలలోని ప్రేక్షకులతో ఉన్న బలమైన అనుబంధానికి ప్రతీకగా నిలిచింది.

See also  ఘనంగా త్రివణ గురుపీఠం ప్రారంభోత్సవం

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.