Skip to content

‘జనవరి 12 విడుదల’ నుంచి ‘డివికి డివికి’ సాంగ్ రిలీజ్

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘జనవరి 12 విడుదల’. హిట్ మెషీన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. కలర్‌ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు, ఎంటర్‌టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించనుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ ఫస్ట్ సింగిల్…

Read more

శరవేగం గా షూటింగ్ జరుపుకుంటున్న వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబో ‘జనవరి 12 విడుదల’

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్, హ్యూమర్, కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కంప్లీట్ ప్యాకేజీగా అలరించనుంది. తాజాగా చిత్ర బృందం కజకిస్థాన్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఈ షెడ్యూల్ కోసం దర్శకుడు అనిల్ రావిపూడి యాక్షన్, పాటల కలయికతో ప్రత్యేకమైన ప్లాన్ సిద్ధం చేశారు…

Read more

‘ఆదర్శ కుటుంబం’ చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ చాలా థాంక్స్ : విక్టరీ వెంకటేష్

‘ఆదర్శ కుటుంబం’ చిత్రం పట్ల ప్రేక్షకుల స్పందనకు, ప్రేమకు ధన్యవాదాలు : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషించారు. రెండు దశాబ్దాల తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్‌ కలయికలో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులంతా ‘ఆదర్శ కుటుంబం’ కోసం ఎంతగానో ఎదురుచూశారు. భారీ అంచనాల నడుమ శుక్రవారం(అక్టోబర్‌ 30) ఈ…

Read more

‘ఆదర్శ కుటుంబం’ మీ అందరికీ నచ్చుతుంది : విక్టరీ వెంకటేష్

ఒక సామాన్యుడు తెగిస్తే కుటుంబం కోసం ఎంతదూరం వెళ్తాడో అదే ఈ ‘ఆదర్శ కుటుంబం’ : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 20 ఏళ్ల తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్‌ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ‘ఆదర్శ కుటుంబం’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దీపావళి…

Read more

‘జనవరి 12 విడుదల’ నుంచి కీర్తి సురేష్ రస్టిక్, ట్రెడిషనల్ ఫస్ట్ లుక్ రిలీజ్

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘జనవరి 12 విడుదల’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఇప్పటికే వెంకటేష్, కల్యాణ్ రామ్, కృతిశెట్టి ఫస్ట్ లుక్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా, హీరోయిన్ కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న లతారెడ్డి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో కీర్తి సురేష్…

Read more

#జనవరి 12 విడుదల’ ఊటీలో కీలక షెడ్యూల్ ప్రారంభం

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘జనవరి 12 విడుదల’. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ను చిత్ర బృందం ఊటీలో ప్రారంభించింది. సుందరమైన ప్రకృతి అందాల నడుమ ఈ షెడ్యూల్ జరగనుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి, అజయ్ ఘోష్, ఉపేంద్ర లిమాయే సహా ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్‌లో రెండు…

Read more

‘జనవరి 12 విడుదల’ నుంచి దీపుగా కృతి శెట్టి ట్రెడిషనల్ ఫస్ట్ లుక్‌ రిలీజ్

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మోస్ట్ అవైటెడ్ ఫెస్టివ్ ఎంటర్‌టైనర్ ‘జనవరి 12 విడుదల’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి ఆర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ ఆసక్తిని పెంచుతోంది. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్ర టైటిల్‌ను మేకర్స్ ఇటీవల హిలేరియస్, ఎంటర్‌టైనింగ్ వీడియో ద్వారా ప్రకటించారు. దీంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది. ఇప్పటికే వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్స్‌ను పరిచయం చేసిన మేకర్స్.. తాజాగా హీరోయిన్ కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమెను ‘దీపు’…

Read more

వెంకటేష్, కళ్యాణ్ రామ్ మూవీ టైటిల్ ‘జనవరి 12 విడుదల’

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్స్ ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటీ పెంచగా, తాజాగా మేకర్స్ టైటిల్‌ను రివీల్ చేశారు. ఇప్పటివరకు #VenkyAnil5 / #NKRAR2 వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ సినిమాకు ‘జనవరి 12 విడుదల’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. అనిల్ రావిపూడి మార్క్ ఫన్‌తో రూపొందించిన వీడియో ద్వారా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోను లెజెండరీ దర్శకుడు ఈవీవీ…

Read more

#VenkyAnil5 #NkrAR2 నుంచి విక్టరీ వెంకటేష్ ఫస్ట్ లుక్ రిలీజ్

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #VenkyAnil5 #NKRAR2 భారీ వినోదాత్మక చిత్రంగా రూపుదిద్దుకుంటూ శరవేగంగా ముందుకు సాగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ పుట్టినరోజున విడుదల చేసిన ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఇండస్ట్రీలో వెంకటేష్ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వెంకటేష్ ఇండియన్ ఆర్మీ క్యామోఫ్లేజ్ యూనిఫామ్‌లో, సన్‌గ్లాసెస్, స్కార్ఫ్ ధరించి పవర్ ఫుల్ గా కనిపించారు. ఓ రగ్గడ్ SUV పక్కన నిల్చున్న…

Read more

#VenkyAnil5 (#NkrAR2)- షూటింగ్‌లో జాయిన్ అయిన వెంకటేష్

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #VenkyAnil5 (#NKRAR2) చిత్రం కోసం జతకట్టారు. 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై సాహు గారపాటి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కల్యాణ్ రామ్ పుట్టినరోజున విడుదలైన ఆయన 'ఫస్ట్-లుక్' పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. కల్యాణ్ రామ్, ఇతర నటీనటులపై చిత్రీకరించిన ఒక పాట షూటింగ్‌ను చిత్ర బృందం ఇటీవల పూర్తి చేసింది. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌లో కీర్తి సురేష్, కృతి శెట్టి కూడా పాల్గొంటున్నారు. తాజాగా విక్టరీ వెంకటేష్ షూటింగ్ సెట్‌లో చేరారు. ప్రస్తుతం ప్రధాన తారాగణంతో కూడిన కీలక సన్నివేశాలను…

Read more