Skip to content

#VenkyAnil5 #NkrAR2 నుంచి విక్టరీ వెంకటేష్ ఫస్ట్ లుక్ రిలీజ్

విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #VenkyAnil5 #NKRAR2 భారీ వినోదాత్మక చిత్రంగా రూపుదిద్దుకుంటూ శరవేగంగా ముందుకు సాగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ పుట్టినరోజున విడుదల చేసిన ఆయన ఫస్ట్-లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది.

ఇండస్ట్రీలో వెంకటేష్ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వెంకటేష్ ఇండియన్ ఆర్మీ క్యామోఫ్లేజ్ యూనిఫామ్‌లో, సన్‌గ్లాసెస్, స్కార్ఫ్ ధరించి పవర్ ఫుల్ గా కనిపించారు. ఓ రగ్గడ్ SUV పక్కన నిల్చున్న ఆయన లుక్‌లో ఇంటెన్సిటీ అదిరిపోయింది. ఈ లుక్‌తో వెంకటేష్ ఓ రగ్గడ్ మిలటరీ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారనే విషయం అర్థమవుతోంది.

పోస్టర్‌లో వెంకటేష్ పాత్రను లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా పరిచయం చేశారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఆయన కౌంటర్ టెర్రరిజం, హోస్టేజ్ నెగోషియేషన్‌లో నిపుణుడిగా కనిపించనున్నారు. బ్యాక్‌డ్రాప్‌లో కనిపించే ఆర్మీ ఇన్‌సిగ్నియా, క్రాస్‌డ్ స్వోర్డ్స్ ఎంబ్లమ్ సినిమా మిలటరీ నేపథ్యాన్ని మరింత ఎఫెక్టివ్ గా వున్నాయి.

మ్యూటెడ్ బ్లూ-గ్రీన్ స్కై, రాకీ టెర్రైన్, భారీ SUVతో పోస్టర్‌కు అడ్వెంచరస్, దేశభక్తి టచ్ వచ్చింది. ఎర్తీ క్యామోఫ్లేజ్ టోన్స్ కూడా ఈ రగ్గడ్ లుక్‌కు చక్కగా సరిపోయాయి.

వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వారి మధ్య ఉండే కెమిస్ట్రీ, కామెడీ.. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు మరింత బలాన్ని చేకూర్చనున్నాయి.

వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి కనిపించనున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

హ్యూమర్, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాతో పాటు పండగ వాతావరణానికి తగ్గ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రం సంక్రాంతి 2027 కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నటీనటులు: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: సాహు గారపాటి
సమర్పణ: సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, శ్రీమతి అర్చన
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. కృష్ణ
సినిమాటోగ్రాఫర్: సమీర్ రెడ్డి
ఎడిటర్: తమ్మిరాజు
ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్. ప్రకాష్
పీఆర్ఓ: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.