Skip to content

‘జబ్ ఖులి కితాబ్’ ట్రైలర్ రిలీజ్.. మార్చి 6 నుంచి హిందీ ZEE5లో స్ట్రీమింగ్

‘జబ్ ఖులి కితాబ్’ ట్రైలర్ రిలీజ్.. మార్చి 6 నుంచి హిందీ ZEE5లో స్ట్రీమింగ్ Telugu News

హిందీ ZEE5 తాజాగా ‘జబ్ ఖులి కితాబ్’ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ప్రేక్షకులకు ఓ అందమైన, పరిణతి చెందిన ప్రేమను చూపించే ప్రయత్నం చేసింది. సౌరభ్ శుక్లా రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పంకజ్ కపూర్, డింపుల్ కపాడియా ప్రధాన పాత్రల్ని పోషించారు. ఐదు దశాబ్దాల పాటు కొనసాగిన వివాహాబంధం, భావోద్వేగ సంక్లిష్టతలు, వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్‌లో ఎంతగా నవ్వించారో.. అంతే స్థాయిలో ఆలోచనల్ని రేకెత్తించారు.
ఈ ట్రైలర్‌ను చూస్తే.. గోపాల్ (పంకజ్ కపూర్), అనసూయ (డింపుల్ కపాడియా) ప్రపంచం ఏంటో అర్థం అవుతుంది. ఈ జంట 50 సంవత్సరాల తమ వివాహా బంధానికి పుల్ స్టాప్ పెట్టాలని, విడాకులు తీసుకోవాలని అనుకుంటారు. గోపాల్ విడాకులు కావాలని కోరితే.. అనసూయ మాత్రం విడాకులకు అంగీకరించదు. ఇక వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో కుటుంబం ఎంతో నిండుగా ఉంటుంది. చావు బతుకుల్లో బెడ్డు మీద ఉండే తన భార్య కోసం గోపాల్ ఎంతో ఆరాట పడుతుంటాడు. కానీ విడాకులు ఎందుకు అడుగుతున్నాడు? దీని వెనుకున్న కథ ఏంటి? అనే ఉత్సుకతను కలిగించేలా ట్రైలర్‌ను కట్ చేశారు.
పంకజ్ కపూర్ మాట్లాడుతూ .. ‘‘జబ్ ఖులి కితాబ్’ చిత్రం సౌరభ్ శుక్లా దర్శకత్వం, రచన వల్ల ప్రత్యేకంగా నిలిచింది. పరిణతి చెందిన ప్రేమను చెప్పాలని అనుకోవడం గొప్ప విషయం. ఎంతో నిజాయితీ, సున్నితత్వంతో ఈ మూవీని ఆయన చేశారు. సౌరభ్ రిఫ్రెషింగ్ మాత్రమే కాకుండా, లోతుగా వాస్తవికమైన కథనాన్ని రూపొందించారు. ప్రేమ వయస్సుతో మసకబారదని ఈ సినిమాతో చెప్పే ప్రయత్నం చేశారు. ప్రేమ కాలానికి తగ్గట్టుగా పరిణామం చెందుతుంది, క్లిష్టతరం చేస్తుంది, గాయపరుస్తుంది, నయం చేస్తుంది. ఇలాంటి ఓ గొప్ప కథలో భాగమవ్వడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
డింపుల్ కపాడియా మాట్లాడుతూ .. ‘‘జబ్ ఖులి కితాబ్’ కథ నా మనసుకెంతో దగ్గరైంది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్‌లాగా అనిపిస్తుంది. ఇది ఒక అందమైన కథ. పంకజ్ కపూర్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. సౌరభ్ దర్శకత్వం వల్ల ఈ చిత్రం మరోస్థాయికి వెళ్లింది. అనసూయ పాత్రలో చాలా లేయర్స్ ఉంటాయి. ఎంతో నిజాయితీతో, ఎంతో భావోద్వేగంతో ఆయన ఈ పాత్రను రాసినట్టుగా అనిపిస్తుంది. అనసూయ తన వివాహాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించడం లేదు, నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తోంది. అలా ఉండటానికి అపారమైన మనో ధైర్యం అవసరం. ఇంత సూక్ష్మమైన పాత్రను చిత్రీకరించడం, అందులో నేను నటించడం ఆనందంగా ఉంది. ఇలాంటి మూవీని నిర్మించిన అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, హిందీ ZEE5లకు నేను కృతజ్ఞురాలిని’ అని అన్నారు.

See also  అఖండ 2 తాండవం' గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది: బోయపాటి శ్రీను

అపరశక్తి ఖురానా మాట్లాడుతూ .. ‘నా పాత్ర గోపాల్, అనసూయ కారెక్టర్స్ చుట్టూ తిరిగుతుంది. ఈ కథలో హాస్యంతో పాటుగా ఎంతో ఎమోషన్ ఉంటుంది. క్షమాపణకు ఉండే విలువని ఈ సినిమాలో ఎంతో గొప్పగా చూపించారు. ఇది ఒక అరుదైన కథ’ అని అన్నారు.

‘జబ్ ఖులి కితాబ్’ సినిమా వృద్యాప్యం, ఆ దశలో ఉండే ప్రేమ, కుటుంబ విలువలు, ప్రేమకి అసలు నిర్వచనం చెప్పేలా ఉంటుంది. ఈ చిత్రం మార్చి 06, 2026న ZEE5లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.