Skip to content

‘సింగ్ గీతం’ జూన్ 11న థియేటర్లలో రిలీజ్

‘సింగ్ గీతం’ జూన్ 11న థియేటర్లలో రిలీజ్ Telugu News

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌లో, పలు భాషల్లో దాదాపు అరవై చిత్రాలతో ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసిన సంగీతం, 94 ఏళ్ల వయసులో డైరెక్టర్ చైర్ లోకి తిరిగి వస్తూ, సృజనాత్మకతకు హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు. ఐకానిక్ మూకీ చిత్రం ‘పుష్పక్’ నుంచి విజనరీ సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ ‘ఆదిత్య 369’ వరకు ఆయన క్రియేటివిటీకి పర్యాయపదంగా నిలిచారు. కమల్ హాసన్‌తో ఆయన చేసిన ‘విచిత్ర సహోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజన్’ బెంచ్ మార్క్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు, భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ ఫాంటసీగా రూపొందించబడిన ‘సింగ్ గీతం’తో అలరించబోతున్నారు. ఈ చిత్రం సంగీతం, మ్యాజికల్ రియలిజంను మేళవించి ఓ యూనిక్ అనుభూతిని అందిస్తుంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ల పై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్, ఒక దిగ్గజ దార్శనికుడిని, లెజండరీ నిర్మాణ సంస్థను ఒకచోట చేర్చింది.

ఒక రహస్యమైన గ్రామం నేపథ్యంలో సాగే ‘సింగ్ గీతం’, ప్రతాప్ అనే యువకుడి కథ చుట్టూ తిరుగుతుంది. అవకాశాల కోసం ప్రయత్నించే ప్రతాప్ జీవితం అనుకోని మార్గంలోకి వెళ్లుతుంది. కనిపించేదంతా నిజం కాని ప్రపంచంలోకి అతను అడుగుపెడతాడు. అభివృద్ధి, పరిరక్షణ మధ్య జరిగే సంఘర్షణలో చిక్కుకుని, తన నిర్ణయాలు, నమ్మకాలు, లక్ష్యాలను ప్రశ్నించుకునే పరిస్థితి వస్తుంది.

యూనిక్ కాన్సెప్ట్, ఫాంటసీ కథనంతో ‘సింగ్ గీతం’ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని అందించబోతుంది. ఇది సింగీతం శ్రీనివాసరావు గారి వినూత్న ప్రయాణానికి మరో మైలురాయిగా నిలవనుంది.

యంగ్ లీడ్ కాస్ట్ అయిన ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండేపూడి తమ తమ పాత్రల్లో ఆకట్టుకునే నటన కనబరిచారు. ఫాంటసీకి హాస్యాన్ని మేళవించడంలో సింగీతం గారి ప్రత్యేక శైలి మరోసారి ఆకట్టుకుంది.

టెక్నికల్‌గా కూడా సినిమా బలంగా ఉంది. అంకూర్ సి సినిమాటోగ్రఫీ విజువల్‌గా ఆకట్టుకుంటుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కథకి ప్రత్యేకమైన మూడ్‌ని క్రియేట్ చేసింది. ఆర్ట్ డైరెక్టర్ అరవింద్ మూలే క్రియేట్ చేసిన ప్రపంచం కథకి మరింత డెప్త్ ని తీసుకొస్తుంది. ప్రొడక్షన్ విల్యూస్ గొప్ప స్థాయిలో ఉన్నాయి.

టైటిల్ టీజర్‌తోనే మంచి అంచనాలు ఏర్పరచుకున్న ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి, తులసి PA, బెనర్జీ, శివనారాయణ, అగు స్టాన్లీ

దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
నిర్మాత: నాగ్ అశ్విన్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: సంకల్ప్ గోరా
DOP: అంకుర్ సి
రచయితలు: సింగీతం శ్రీనివాసరావు, గౌతమి చల్లగుల్లా, శశాంక్, శ్రీకర్, నంద కిషోర్ ఈమని, రాహుల్ వి రాజేశ్వర్
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మ్యూల్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గీతా గౌతమ్
డిజిటల్ మీడియా PR & మార్కెటింగ్: ప్రసాద్ భీమనాధం
PRO: వంశీ-శేఖర్

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.