Skip to content

సునీల్ నారంగ్ రాజీనామా

సునీల్ నారంగ్ రాజీనామా Telugu News
సునీల్ నారంగ్ రాజీనామా Telugu News

హైదరాబాద్, మే 20:
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారవేత్త సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సమర్పించిన రాజీనామా లేఖను ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పరిశీలించి ఆమోదించింది.

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున విడుదల చేసిన అధికారిక లేఖలో, సునీల్ నారంగ్ సమర్పించిన రాజీనామా పత్రాన్ని పరిశీలించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూ అధ్యక్ష పదవి నుంచి తక్షణమే విముక్తి కల్పించినట్లు వెల్లడించారు.