Skip to content

లెజెండరీ పీఆర్ఓ, ప్రముఖ చలనచిత్ర పాత్రికేయులు బీఏ రాజు గారి 5వ వర్ధంతి

లెజెండరీ పీఆర్ఓ, ప్రముఖ చలనచిత్ర పాత్రికేయులు బీఏ రాజు గారి 5వ వర్ధంతి Telugu News
లెజెండరీ పీఆర్ఓ, ప్రముఖ చలనచిత్ర పాత్రికేయులు బీఏ రాజు గారి 5వ వర్ధంతి Telugu News
లెజెండరీ పీఆర్ఓ, ప్రముఖ చలనచిత్ర పాత్రికేయులు బీఏ రాజు గారి 5వ వర్ధంతి Telugu News

ఈ రోజు (మే 21) చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు సైతం బీఏ రాజు గారి స్ఫూర్తివంతమైన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటున్నారు. మే 21న ఆయన అయిదవ వర్ధంతి సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమపై ఆయన వేసిన చెరగని ముద్రను గుర్తు చేసుకుందాం.

నలభై ఏళ్లకు పైగా సాగిన కెరీర్‌తో బీఏ రాజు గారు ఒక గొప్ప మార్గదర్శకుడిగా నిలిచారు. ఫిల్మ్ జర్నలిస్ట్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, మ్యాగజైన్, వెబ్‌సైట్ హెడ్, నిర్మాతగా ఆయన ఎనలేని సేవలు అందించారు. లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ గారికి పీఆర్ఓగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, అద్భుతంగా పబ్లిసిటీ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్‌గా ఎదిగి, సూపర్ హిట్ వీక్లీ, క్రేజీ వరల్డ్ వంటి పత్రికలకు సంపాదకుడిగా పనిచేశారు. సినిమా పట్ల ఆయనకున్న అంకితభావం, అభిరుచి ప్రతి దశలోనూ కనిపించాయి.

జర్నలిజానికే పరిమితం కాకుండా సూపర్ హిట్ ఫ్రెండ్స్, ఆ తర్వాత ఆర్జే సినిమాస్ బ్యానర్ల పై నిర్మాతగా మారారు. ‘ప్రేమలో పవని కళ్యాణ్’, ‘చంటిగాడు’, ‘లవ్లీ’, ‘వైశాఖం’ వంటి గుర్తుండిపోయే చిత్రాలను అందించారు. తన సతీమణి, దివంగత బి. జయ గారితో కలిసి నిర్మించిన చిత్రాలు ప్రేక్షకుల హృదయాలకు చేరువయ్యాయి. కథ చెప్పడంలో, సినిమా నిర్మాణంలో ఆయనకున్న నైపుణ్యం వాటిలో స్పష్టంగా కనిపిస్తుంది.

తన కెరీర్‌లో ఎందరో ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. దర్శకులు, నటులు, టెక్నీషియన్లకు విలువైన సలహాలు, మద్దతు ఇచ్చారు. ఆయన వృత్తి నిబద్ధత, నిజాయితీ ఆయనకు అందరి గౌరవాన్ని సంపాదించిపెట్టాయి. సినిమాపై ఆయనకున్న విస్తృతమైన జ్ఞానం, అంకితభావం స్ఫూర్తిని ఇస్తాయి.

ఎవర్‌గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో బీఏ రాజు గారికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఎందరో జర్నలిస్టులకు మార్గదర్శిగా ఉన్న ఆయన వారసత్వం నేటి తరం ఫిల్మ్ మేకర్లను, మీడియా ప్రతినిధులలో కొనసాగుతూనే ఉంది.

ఈ సందర్భంగా సినిమాపై అపారమైన ప్రేమతో, తెలుగు సినిమా సంస్కృతిని సుసంపన్నం చేసిన బీఏ రాజు గారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాం. ఆయనను దగ్గరగా చూసిన వారి మనసుల్లో ఆయన స్ఫూర్తి సజీవంగా ఉంటుంది. తెలుగు చలన చిత్ర పాత్రికేయ రంగానికి బీఏ రాజు గారు చేసిన విశిష్ట సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయి.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.