Skip to content

వినాయక చవితి వేడుకల్లో కొత్త జోష్.. అజయ్ అరసాడ ‘బోలో గణపతి S/O ఉమాపతి’ స్పెషల్ సాంగ్ విడుదల

‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి విభిన్న ప్రాజెక్ట్స్‌తో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ అరసాడ, వినాయక చవితి సందర్భంగా ‘బోలో గణపతి S/O ఉమాపతి’ పేరుతో ఓ ప్రత్యేక సింగిల్‌ను విడుదల చేశారు. ఈ పాటకు సంగీతం అందించడంతో పాటు, తన మ్యూజిక్ లేబుల్ AjA Recordsపై స్వయంగా నిర్మించడం విశేషం. విశాఖపట్నానికి చెందిన అజయ్ అరసాడ సంగీతంపై ఉన్న ఆసక్తితో పాటు టీసీఎస్‌లో ఏడు సంవత్సరాల పాటు పనిచేసిన అనంతరం సినీ సంగీత రంగంలోకి అడుగుపెట్టారు. విభిన్న జానర్స్‌లో సంగీతాన్ని అందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా కలిసిన అజయ్ అరసాడను ఆయన అభినందించడంతో పాటు, భవిష్యత్తులో…

Read more
లెజెండరీ పీఆర్ఓ, ప్రముఖ చలనచిత్ర పాత్రికేయులు బీఏ రాజు గారి 5వ వర్ధంతి Telugu News

లెజెండరీ పీఆర్ఓ, ప్రముఖ చలనచిత్ర పాత్రికేయులు బీఏ రాజు గారి 5వ వర్ధంతి

ఈ రోజు (మే 21) చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు సైతం బీఏ రాజు గారి స్ఫూర్తివంతమైన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటున్నారు. మే 21న ఆయన అయిదవ వర్ధంతి సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమపై ఆయన వేసిన చెరగని ముద్రను గుర్తు చేసుకుందాం. నలభై ఏళ్లకు పైగా సాగిన కెరీర్‌తో బీఏ రాజు గారు ఒక గొప్ప మార్గదర్శకుడిగా నిలిచారు. ఫిల్మ్ జర్నలిస్ట్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, మ్యాగజైన్, వెబ్‌సైట్ హెడ్, నిర్మాతగా ఆయన ఎనలేని సేవలు అందించారు. లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ గారికి పీఆర్ఓగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, అద్భుతంగా పబ్లిసిటీ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్‌గా ఎదిగి, సూపర్ హిట్ వీక్లీ, క్రేజీ వరల్డ్ వంటి…

Read more
‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రీకరణలో అదొక మెమరబుల్ మూమెంట్: నటుడు ప్రదీప్ కొట్టె Telugu News

‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రీకరణలో అదొక మెమరబుల్ మూమెంట్: నటుడు ప్రదీప్ కొట్టె

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్‌పై నిర్మించిన సినిమా ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ఈ మూవీకి తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించారు.  ఈ సినిమాతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమయ్యారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామా మంచి విజయాన్ని అందుకుంది.  ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ఈ నెల 15వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ సందర్భంగా నటుడు ప్రదీప్ కొట్టె తన సినీ జర్నీ గురించి విశేషాలను పంచుకున్నారు. ఆయన చెప్పిందేంటంటే... * నేపథ్యం... * మాది చిత్తూరు జిల్లా పళమనేరు. చెన్నైలో జాబ్ చేశాను. హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాను. ఇక్కడకు వచ్చాక…

Read more
దిగ్గజాల అడుగుజాడల్లో… దర్శకురాలిగా తనదైన ముద్ర వేసిన బి. జయ Telugu News

దిగ్గజాల అడుగుజాడల్లో… దర్శకురాలిగా తనదైన ముద్ర వేసిన బి. జయ

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకత్వం వంటి సాంకేతిక విభాగాల్లో మహిళలు రాణించడం చాలా అరుదు. గొప్ప మహిళా దర్శకుల గురించి మాట్లాడుకున్నప్పుడు ముందుగా గుర్తొచ్చే పేర్లు భానుమతి మరియు విజయనిర్మల. వారి అడుగుజాడల్లో నడుస్తూ, తన సినిమాలతో ప్రేక్షకులను అలరించి, విజయవంతమైన దర్శకురాలిగా బి. జయ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఒక డైనమిక్ జర్నలిస్ట్ నుండి ప్రముఖ చిత్ర దర్శకురాలిగా ఎదిగిన ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని, జనవరి 11న ఆమె జయంతి సందర్భంగా స్మరించుకుందాం. 1964, జనవరి 11న రావులపాలెంలో జన్మించిన బి. జయ విద్యావంతురాలు. ఆమె ఇంగ్లీష్ లిటరేచర్, జర్నలిజం మరియు సైకాలజీలో డిగ్రీలు పూర్తి చేశారు. ఆమె ఆంధ్రాజ్యోతి మరియు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలలో జర్నలిస్ట్‌గా తన…

Read more