Skip to content

వినాయక చవితి వేడుకల్లో కొత్త జోష్.. అజయ్ అరసాడ ‘బోలో గణపతి S/O ఉమాపతి’ స్పెషల్ సాంగ్ విడుదల

‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి’ వంటి విభిన్న ప్రాజెక్ట్స్‌తో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ అరసాడ, వినాయక చవితి సందర్భంగా ‘బోలో గణపతి S/O ఉమాపతి’ పేరుతో ఓ ప్రత్యేక సింగిల్‌ను విడుదల చేశారు. ఈ పాటకు సంగీతం అందించడంతో పాటు, తన మ్యూజిక్ లేబుల్ AjA Recordsపై స్వయంగా నిర్మించడం విశేషం.

విశాఖపట్నానికి చెందిన అజయ్ అరసాడ సంగీతంపై ఉన్న ఆసక్తితో పాటు టీసీఎస్‌లో ఏడు సంవత్సరాల పాటు పనిచేసిన అనంతరం సినీ సంగీత రంగంలోకి అడుగుపెట్టారు. విభిన్న జానర్స్‌లో సంగీతాన్ని అందిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా కలిసిన అజయ్ అరసాడను ఆయన అభినందించడంతో పాటు, భవిష్యత్తులో కలిసి పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేయడం విశేషంగా నిలిచింది.

తాజాగా విడుదలైన ‘బోలో గణపతి S/O ఉమాపతి’ పాటను అజయ్ అరసాడ కేవలం రెండు రోజుల్లోనే కంపోజ్ చేశారు. గణపతిని ఉత్సాహంగా, యూత్‌ఫుల్‌గా సెలబ్రేట్ చేసే విధంగా ఈ పాటను రూపొందించారు. జయరామ్ పైలా, సింధూజ రాజేష్ ఎనర్జిటిక్ వోకల్స్ అందించగా.. భాస్కర్ తిరుమల సింపుల్‌గా, ట్రెండీగా, అర్థవంతమైన సాహిత్యాన్ని అందించారు.

లిరికల్ సాంగ్‌లో పాట కంపోజిషన్‌ను హైలైట్ చేస్తూ, లిరిక్స్‌కు అనుగుణంగా గణేష్ మహారాజ్ పెయింటింగ్ ఫ్రేమ్స్‌ను చూపించడం ఆకట్టుకునేలా ఉంది. భక్తి పాటకు ట్రెండీ మ్యూజిక్ టచ్ ఇవ్వడం ఈ సింగిల్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

తెలుగు సాహిత్యంతో పాటు సంస్కృత పదాలను, సందర్భానికి సహజంగా సరిపోయే ఇంగ్లీష్ పదాలను మేళవిస్తూ పాటను కొత్త తరహాలో రూపొందించారు. క్యాచీ లిరిక్స్, పెప్పీ బీట్, ఎనర్జిటిక్ వోకల్స్‌తో ‘బోలో గణపతి S/O ఉమాపతి’ జెన్ జీతో పాటు అన్ని వయసుల వారిని ఆకట్టుకునేలా సాగుతుంది.

భక్తి, ఉత్సాహం, ఆధునిక సంగీత శైలిని కలగలిపిన ఈ పాట వినాయక చవితి వేడుకలకు మరింత జోష్‌ను తీసుకొస్తోంది. వినగానే ఆకట్టుకునే ఎనర్జీ, హ్యాపీ వైబ్‌తో సాగే ట్రెండీ లిరిక్స్, గణపతిని కొత్త తరహాలో సెలబ్రేట్ చేసే విధానం ఈ పాటకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి.

మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్న అజయ్ అరసాడ, నిర్మాతగా ప్రారంభించిన AjA Records‌కు ‘బోలో గణపతి S/O ఉమాపతి’ మంచి ఆరంభాన్ని అందించింది.
పాట : బోలో గణపతి S/o ఉమాపతి
సంగీతం : అజయ్ అరసాడ
సాహిత్యం : భాస్కర్ తిరుమల
గాయకులు : జయరామ్ పైలా, సింధూజ రాజేష్
రిథమ్స్ : సాయిరామ్ పైలా
కీబోర్డ్ ప్రోగ్రామింగ్ : జయరామ్ పైలా
నాదస్వరం : మల్లికార్జున్
నిర్మాత : అజయ్ అరసాడ
కెమెరా : శ్రీకర్ (@Siacaptures)
కాన్సెప్ట్ & ఎడిటింగ్ : వెంకట్ చిక్కాల
పీ ఆర్ ఓ : ఇండస్ట్రీహిట్ శివ
స్టూడియో & లేబుల్ : AjA Records

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.