Skip to content

పవర్, న్యాయం మధ్య పోరాటాన్ని తెలిపే ‘SYSTEM’ ట్రైలర్ విడుదల

పవర్, న్యాయం మధ్య పోరాటాన్ని తెలిపే ‘SYSTEM’ ట్రైలర్ విడుదల Telugu News

ప్రైమ్ వీడియో తమ కొత్త ప్రైమ్ ఒరిజినల్ సినిమా SYSTEM ట్రైలర్‌ను విడుదల చేసింది. కోర్ట్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవర్, న్యాయం మధ్య జరిగే పోరాటాన్ని ఆసక్తికరంగా చూపించారు. ఈ చిత్రానికి అశ్విని అయ్యర్ తివారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, జ్యోతిక, అశుతోష్ గోవరికేర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మే 22 నుంచి ప్రైమ్ వీడియో లో మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ కానుంది.

ట్రైలర్‌లో నేహా అనే యువ లాయర్ పాత్రలో సోనాక్షి సిన్హా కనిపించారు. తన తండ్రిలా ఫర్మ్‌లో పార్ట్నర్ కావాలని ఆశపడే ఆమె, తన ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో కోర్ట్ స్టెనోగ్రాఫర్ సారిక పాత్రలో నటించిన జ్యోతికతో కలిసి పని చేస్తుంది. అయితే సారికకు కొన్ని గోప్యమైన ఉద్దేశాలు కూడా ఉంటాయి. కోర్ట్ సన్నివేశాలు, భావోద్వేగాలు, ఆలోచింపజేసే డైలాగులతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

“పవర్ ముందు నిజం నిలబడగలదా? న్యాయం గెలుస్తుందా?” అనే ప్రశ్నను సినిమా ప్రధానంగా చూపించబోతోంది. దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారి మాట్లాడుతూ, నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథతో ఈ సినిమా రూపొందిందని తెలిపారు. అలాగే సోనాక్షి సిన్హా, జ్యోతిక ఈ చిత్రం తమ నటనకు కొత్త సవాల్‌గా నిలిచిందని చెప్పారు. ప్రేక్షకులను ఆలోచింపజేసే కథలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడంలో ప్రైమ్ వీడియో మంచి వేదిక అని ఆమె అభిప్రాయపడ్డారు.