Skip to content

సరోజ్ కుమార్ స్వీయ నిర్మాణంలో రానున్న ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్

‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’ వంటి చిత్రాలతో తనలోని విలక్షన నటుడ్ని అందరికీ పరిచయం చేసుకున్నాడు సరోజ్ కుమార్. ఆయన నటన, మేకింగ్, టేకింగ్ అంటే ఓ వర్గానికి చెందిన ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ప్రస్తుతం సరోజ్ మరో వినూత్న కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు. సరోజ్ ప్రధాన పాత్రల్లో రానున్న నూతన చిత్రం ‘ఛప్రి’. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతల్ని సరోజ్ నిర్వర్తించారు. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ మీద సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మించిన ఈ సినిమాలో సరోజ్‌తో పాటుగా ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీన్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్,…

Read more

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి 5 కొత్త పోస్టర్లు విడుదల

మార్వెల్ స్టూడియోస్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి 5 కొత్త పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్లలో మార్వెల్ సినీ విశ్వంలోని అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుల్లో ఒకరైన డాక్టర్ డూమ్‌ను ప్రధానంగా చూపించారు. భారీ తారాగణం, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినీ అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది. మార్వెల్ సినిమాల అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది అతిపెద్ద సినీ వేడుకల్లో ఒకటిగా నిలవనుంది. ఈ చిత్రం 2026 డిసెంబర్ 17న భారతదేశంలోని థియేటర్లలో విడుదల కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం,…

Read more

నవంబర్ 12న విడుదల కానున్న‘అ (AH)’ సినిమా పెద్ద హిట్ అవ్వాలి; నిర్మాత వంశీ నందిపాటి

రాహుల్ విజయ్, అర్చనా అయ్యర్ ప్రధాన పాత్రల్లో స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై కనకరావు తొనంగి, అభిషేక్ కె, ప్రముఖ ఎడిటర్ గ్యారీ BH నిర్మించిన చిత్రం ‘అ (AH)’. ఈ సినిమాకి సాయి బాలి దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. నవంబర్ 12న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నందినీ రెడ్డి, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి, హీరో ఆకాష్ పూరి, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ…

Read more

నవంబరు 12న ‘అ’ విడుదల

రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'అ' (‘AH) ’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. అడివి శేష్ విడుదల చేసిన సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన రావడంతో పాటు. ‘బ్లడీ హంగర్’ పేరుతో విడుదల చేసిన ఈ చిత్రం గ్లింప్స్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇటీవల విడుదల చేసిన ఇదేనా ఇదేనా అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని మొదట అక్టోబర్‌ 30న థియేట్రికల్‌ చేయాలనుకున్నారు. అయితే ఏ విషయంలోనూ కాంప్రమైజ్‌ కానీ ఈ చిత్ర మేకర్స్ చిత్రాన్ని నవంబరు 12న గ్రాండ్‌గా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ…

Read more

డిసెంబర్ 17న ఇండియాలో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ విడుదల

భారతీయ అభిమానులకు మార్వెల్ స్టూడియోస్ దీపావళి కానుకగా డాక్టర్ డూమ్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్, స్టీవ్ రోజర్స్‌గా క్రిస్ ఎవాన్స్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అమెరికా కంటే ఒక రోజు ముందుగానే డిసెంబర్ 17న ఇండియాలో విడుదల చేస్తున్నారు. ఈ దీపావళికి భారతీయ సినీ అభిమానులకు మార్వెల్ స్టూడియోస్ ప్రత్యేక కానుక అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమా అమెరికా కంటే ఒక రోజు ముందుగా 17 డిసెంబర్ 2026న భారతీయ థియేటర్లలో విడుదల కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమా విడుదలకు మరో 50 రోజులు మాత్రమే ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సందర్భంగా…

Read more

పవన్ కళ్యాణ్‌కు అల్లు అరవింద్ అభినందనలు

సినీ రంగంలో పవన్ కళ్యాణ్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో కలిసి చేసిన తొలి సినిమా "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" నుంచి ఇప్పటి వరకు సాగిన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. మూడు దశాబ్దాల కాలం ఇంత త్వరగా గడిచిపోయిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సినీ రంగంలో పవన్ కళ్యాణ్ సాధించిన విజయాలను అభినందిస్తూ, ఆయన ఎంచుకునే ప్రతి మార్గంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సినిమాలకే పరిమితం కాకుండా సమాజం పట్ల పవన్ కళ్యాణ్‌కు ఉన్న దూరదృష్టిని కూడా అల్లు అరవింద్ ప్రశంసించారు. సినిమా రంగం వెలుపల కూడా ఆయన చేస్తున్న…

Read more

మహారాష్ట్రలో విస్తరిస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

ముంబై: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) మహారాష్ట్ర రాష్ట్ర కమిటీని ముంబైలో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా ఏర్పాటు చేశారు. దీంతో మహారాష్ట్రలో AAFA కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయి. రాష్ట్ర కమిటీతో పాటు పరభణి, నాందేడ్, ముంబై, పుణే, పాలం, హింగోలి, ఉమ్రి, సోలాపూర్, గడ్చిరోలి, షిర్డీ జిల్లాల్లో మొత్తం 10 జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు. సామాజిక బాధ్యతలో భాగంగా AAFA ఆధ్వర్యంలో HPV పై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. HPV నివారణ, వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. మహారాష్ట్రలో AAFA నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడంతో పాటు, అభిమానులను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని కొత్తగా ఏర్పాటైన కమిటీలు పనిచేయనున్నాయి. “ప్రతి సంవత్సరం ఒక…

Read more

‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు

లోమేష్‌ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ‌ హీరోయిన్‌గా, ప్రణీత పట్నాయక్, విజ్ఞానిలు ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'డ్యూ డేట్‌' వరిష్‌ స్టూడియోస్‌ పతాకంపై పవన్‌ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలుగా ఆనంద్‌.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవల ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్‌ ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ప్రజెంట్‌ బర్నింగ్‌ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్‌ కోర్ట్‌ రూమ్‌ డ్రామా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతి మనిషి, ప్రతి నెలా గుర్తుపెట్టుకునే డ్యూ డేట్‌ చుట్టు పూర్తి వాణిజ్య అంశాలతో…

Read more

‘లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘లవ్ అండ్ వార్’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రణ్‌బీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ తొలిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేక చిత్రంగా నిలిచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసిన చిత్రబృందం నేడు తాజాగా విక్కీ కౌశల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్‌లో విక్కీ కౌశల్ సిగరెట్, లైటర్‌తో కనిపిస్తూ ఎంతో ఇంటెన్స్‌గా చూస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు చూడని విభిన్నమైన లుక్‌లో విక్కీ కనిపించడం విశేషం. ఆయన లుక్‌లో…

Read more

‘లవ్ & వార్’ నుండి ఆకట్టుకుంటున్న అలియాభట్ ఫస్ట్ లుక్

రణబీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన తర్వాత సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘లవ్ & వార్’ చిత్రంలో అలియా భట్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అలియా ఇంతకుముందెన్నడూ కనిపించని గ్లామరస్ లుక్‌లో మెరిసింది. 2027లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘లవ్ & వార్’ ఒకటి. ఈ సినిమాలో సంజయ్ లీలా భన్సాలీ తన గత చిత్రాలకు భిన్నమైన ఆధునిక ప్రపంచాన్ని చూపించబోతున్నారు. మేకర్స్ సోషల్ మీడియాలో అలియా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విడుదలైన ఈ పోస్టర్‌లో అలియా స్లిట్ స్కర్ట్, ప్రత్యేకమైన హెడ్‌పీస్‌తో కుర్చీలో కూర్చుని కనిపించింది. ఆమె లుక్, స్టైలింగ్, హావభావాలు రెట్రో ఫీల్‌ను అందిస్తున్నాయి. ఈ…

Read more