ఏగన్, శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి…
మహారాష్ట్రలో విస్తరిస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

ముంబై: అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) మహారాష్ట్ర రాష్ట్ర కమిటీని ముంబైలో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా ఏర్పాటు చేశారు. దీంతో మహారాష్ట్రలో AAFA కార్యకలాపాలు మరింత విస్తరించనున్నాయి.
రాష్ట్ర కమిటీతో పాటు పరభణి, నాందేడ్, ముంబై, పుణే, పాలం, హింగోలి, ఉమ్రి, సోలాపూర్, గడ్చిరోలి, షిర్డీ జిల్లాల్లో మొత్తం 10 జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు.
సామాజిక బాధ్యతలో భాగంగా AAFA ఆధ్వర్యంలో HPV పై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. HPV నివారణ, వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
మహారాష్ట్రలో AAFA నెట్‌వర్క్‌ను మరింత విస్తరించడంతో పాటు, అభిమానులను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని కొత్తగా ఏర్పాటైన కమిటీలు పనిచేయనున్నాయి. “ప్రతి సంవత్సరం ఒక మంచి పని” అనే AAFA లక్ష్యానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలను కొనసాగించనున్నారు.

