Skip to content
చిన్నారి నక్షిత వైద్యం కోసం అండగా నిలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ Telugu News

చిన్నారి నక్షిత వైద్యం కోసం అండగా నిలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

సతీష్ కుమార్తె నక్షిత పుట్టినప్పటి నుంచి “అనోరెక్టల్ మాల్ఫార్మేషన్” అనే జన్యుపరమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. ఇప్పటికే ఆమెకు రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. త్వరలో మరో శస్త్రచికిత్స జరగనుంది. నక్షిత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న AAFA కార్యాలయం, ఆమె వైద్యం మరియు వైద్య ఖర్చుల కోసం ₹1,50,000 ఆర్థిక సహాయాన్ని అందించింది. AAFA సభ్యులు మాట్లాడుతూ, సంఘ సభ్యులు మరియు వారి కుటుంబాలకు ఎలాంటి కష్టసమయంలోనైనా అండగా నిలుస్తామని, అవసరమైన సహాయాన్ని ఎప్పటికప్పుడు అందిస్తామని తెలిపారు.

Read more
HPV వ్యాక్సిన్ డ్రైవ్‌కు AAFA సపోర్ట్ Telugu News

HPV వ్యాక్సిన్ డ్రైవ్‌కు AAFA సపోర్ట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) హెచ్ పీవీ వ్యాక్సిన్ డ్రైవ్ కు మద్ధతుగా నిలిచేందుకు ముందుకొచ్చింది. AAFA ఈ ఏడాది మొత్తం ప్రజల్లో హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాలు చేయనుంది. ఏడాదికో మంచి పని చేయాలంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని AAFA ఈ ఇనిషేటివ్ తీసుకుంది. హెచ్ పీవీ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మన ఆడ బిడ్డలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారు. 9 నుంచి 26 ఏళ్ల వయసున్న బాలికలు, మహిళలు ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ఉచితంగా తీసుకోవచ్చు. కేంద్రప్రభుత్వం స్వస్తి నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా…

Read more
ఆంధ్రప్రదేశ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) కీలక సమావేశం ! Telugu News

ఆంధ్రప్రదేశ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) కీలక సమావేశం !

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంస్థను బలోపేతం చేస్తూ ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి మరియు గుంటూరు జిల్లాలకు కొత్త కమిటీలను ఏర్పాటు చేశారు. AAFA ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ శివ కుమార్ గారు నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి “ప్రతి సంవత్సరం ఒక మంచి పని” సందేశాన్ని ముందుకు తీసుకెళుతూ సమాజ సేవా కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు తెలిపారు.

Read more