Skip to content

వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా శివాజీ

ప్రేక్షకులు నటుడిగా తనకు ఇచ్చిన గుర్తింపును బాధ్యతగా ఫీలయ్యి, వాళ్లను వైవిధ్యమైన పాత్రలతో, కంటెంట్‌ ఉన్న సినిమాలతో ఎంటర్‌టైన్‌ చేయడమే లక్ష్యంగా సినిమాలు చేసే నటులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నటుల్లో శివాజీ ముందు వరుసలో ఉంటారు.. నటుడిగా, హీరోగా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ, యాక్షన్ ఇలా అన్ని రకాల కథలతో ఆడియెన్స్‌ని ఆయన ఆకట్టుకున్నారు. అయితే సినిమాలకి కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన బిగ్ బాస్ షోతో మళ్లీ కెరీర్‌ను ప్రారంభించారు. బిగ్ బాస్ షోతో శివాజీ ప్రతీ ఇంటి గడపలోకి, తెలుగు వారి మనసుల్లో మళ్లీ స్థానాన్ని సంపాదించుకున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన శివాజీకి ఎన్నో అవకాశాలు తలుపు…

Read more

‘నాగబంధం’లో మెగా విలన్ ‘అబ్దాలీ’గా రిషబ్ సాహ్నీ సెన్సేషన్..

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'నాగబంధం', అద్భుతమైన విజువల్స్, పురాణ నేపథ్యం మరియు గ్రాండ్ స్కేల్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. వీటన్నింటితో పాటు మరో అంశం ప్రేక్షకుల దృష్టిని బలంగా ఆకర్షిస్తోంది. అదే, మెగా విలన్ 'అబ్దాలీ' పాత్రలో నటించిన రిషబ్ సాహ్నీ ప్రదర్శన. సినిమాలో ఆయన కనిపించిన ప్రతిసారీ థియేటర్‌లో ఒక ప్రత్యేకమైన ఇంపాక్ట్ కనిపిస్తోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్, డామినేటింగ్ ఆరా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో, 'నాగబంధం' సినిమాలోని ప్రధాన హైలైట్స్‌లో రిషబ్ సాహ్నీ నటన ఒకటిగా నిలిచిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా వరుసగా తమ అభిప్రాయాలను…

Read more

‘మిర్జాపూర్: ది మూవీ’ టీజర్ విడుదల

దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ ఫ్రాంచైజీ "మిర్జాపూర్ : ది మూవీ" టీజర్ విడుదలైంది. ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన మిర్జాపూర్ కథ ఇప్పుడు తొలిసారిగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రానుంది. 2018లో ప్రారంభమైన మిర్జాపూర్ కథా ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఈ సినిమా కొత్త మరియు ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 4, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. టీజర్‌లో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి దివ్యేందు తమ పాత్రలతో మరోసారి కనిపించగా, అభిమానుల అభిమాన పాత్ర బబ్లు పండిట్‌గా జితేంద్ర కుమార్ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే రవి కిషన్ కొత్త పాత్రలో చేరి కథకు మరింత బలం చేకూర్చారు. ఇక అభిషేక్…

Read more
‘మిర్జాపూర్: ది మూవీ’  క్యారెక్టర్ పోస్టర్లు విడుదల Telugu News

‘మిర్జాపూర్: ది మూవీ’ క్యారెక్టర్ పోస్టర్లు విడుదల

మిర్జాపూర్: ది మూవీ టీజర్ విడుదలకు ఒక రోజు ముందు మేకర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచేలా ఫస్ట్ లుక్ క్యారెక్టర్ పోస్టర్లను విడుదల చేశారు. మిర్జాపూర్ ప్రపంచాన్ని నిర్వచించిన ‘గద్దీ’, మున్నా భయ్యా, గుడ్డు భయ్యా, కాలీన్ భయ్యా పాత్రలతో రూపొందించిన ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “గద్దీ హై తో హమ్ హై” అనే శక్తివంతమైన సందేశంతో విడుదలైన ఈ పోస్టర్లు మిర్జాపూర్ యూనివర్స్‌లోని అధికారం, వారసత్వం, ప్రత్యర్థిత్వాలను మరోసారి గుర్తు చేస్తున్నాయి. ఈ పోస్టర్ల విడుదలతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. మిర్జాపూర్ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన పాత్రలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుండటంతో సోషల్ మీడియాలో విస్తృత చర్చ సాగుతోంది. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్…

Read more
టామ్ హాలండ్ ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ తెలుగు ట్రైలర్ విడుదల Telugu News

టామ్ హాలండ్ ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ తెలుగు ట్రైలర్ విడుదల

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ నుంచి సెకండ్ ట్రైలర్ విడుదలైంది. నాలుగేళ్ల విరామం తర్వాత టామ్ హాలండ్ మరోసారి స్పైడర్-మ్యాన్‌గా ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ ట్రైలర్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకుల కోసం కూడా అందుబాటులోకి వచ్చింది. ఆమ్‌స్టర్‌డామ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చిత్ర బృందం ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించింది. ట్రైలర్‌లో పీటర్ పార్కర్ జీవితంలో చోటుచేసుకున్న కొత్త పరిణామాలు, అతను ఎదుర్కొనే సరికొత్త సవాళ్లు ఆసక్తికరంగా చూపించారు. ‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ ఘటనల అనంతరం ప్రపంచం మొత్తం పీటర్ పార్కర్‌ను మరిచిపోయిన పరిస్థితుల్లో, అతను మరోసారి…

Read more
జూలై 2న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్‌కు సిద్ధమైన ‘ఇసాకపట్నం’ Telugu News

జూలై 2న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్‌కు సిద్ధమైన ‘ఇసాకపట్నం’

ప్రైమ్ వీడియో తన అత్యంత ఆసక్తికరమైన తెలుగు ఒరిజినల్ సిరీస్‘ఇసాకపట్నం’ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. గ్యారీబీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఏడు ఎపిసోడ్‌ల యాక్షన్ థ్రిల్లర్జూలై 2 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ వీడియో లో ప్రేక్షకులముందుకు రానుంది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ వేదిక ప్రైమ్వీడియో తన ప్రతిష్టాత్మక తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ఇసాకపట్నం’ ప్రపంచవ్యాప్త ప్రీమియర్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ప్రతీకారం, అధికారం, కుటుంబ రాజకీయాలు, గ్యాంగ్ వార్నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ జూలై 2 నుంచిప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు ప్రశాంత్ రాఘతికథా రచన అందించగా, తాజుద్దీన్ సయ్యద్ సంభాషణలు రాశారు. తమడా మీడియా…

Read more
‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’లో స్కెలెటర్ కు మూడు వెర్షన్లలో వాయిస్ ఇచ్చిన ఆదిత్య మీనన్‌ Telugu News

‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’లో స్కెలెటర్ కు మూడు వెర్షన్లలో వాయిస్ ఇచ్చిన ఆదిత్య మీనన్‌

ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్” జూన్ 5న భారతదేశంలో ఘనంగా విడుదల కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రముఖ విలన్ పాత్ర స్కెలెటర్‌కు హిందీ వెర్షన్‌లో ప్రముఖ నటుడు జావేద్ జాఫ్రీ వాయిస్ అందిస్తుండగా, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ తన గాత్రాన్ని అందించడం విశేషం. ఈ సందర్భంగా ఆదిత్య మీనన్ మాట్లాడుతూ, “హీ-మ్యాన్ ఫ్రాంచైజీతో నాకు చిన్ననాటి నుంచి ఎంతో అనుబంధం ఉంది. స్కెలెటర్ వంటి ఐకానిక్ విలన్‌కు మూడు భాషల్లో డబ్బింగ్…

Read more
‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’ Telugu News

‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’

హైదరాబాద్: భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన బిగ్గెస్ట్ యూత్ డేటింగ్ రియాలిటీ షో ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా’(MTV Splitsvilla) సరికొత్త ట్విస్టులతో, మరింత బోల్డ్‌గా మరియు స్పైసీగా మన ముందుకువచ్చేసింది. ఈ ప్రతిష్టాత్మక షో 16వ సీజన్‌ను ‘ఎమ్‌టీవీ స్ప్లిట్స్‌విల్లా X6: ప్యార్యా పైసా’ (MTV Splitsvilla X6: Pyaar ya Paisa) పేరుతో ఘనంగా ప్రారంభించింది. ఈ సీజన్ప్రత్యేకత ఏంటంటే, చరిత్రలోనే మొదటిసారిగా ఈ షో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.మే 12 నుండి ప్రతి వారం శుక్ర, శని, ఆదివారాల్లో రాత్రి 7 గంటలకు ‘జియోహాట్‌స్టార్’(JioHotstar) మరియు ఎమ్‌టీవీ ఛానల్‌లో ప్రసారమవుతోంది. సరికొత్త ట్విస్ట్.. ‘ప్యార్ విల్లా’వర్సెస్ ‘పైసా విల్లా’:  తమిళనాడులోనిఅందమైన మహాబలిపురం తీర ప్రాంతంలో ఈ సీజన్ షూటింగ్ జరుపుకుంది…

Read more
‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ తెలుగు ట్రైలర్‌ విడుదల Telugu News

‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ తెలుగు ట్రైలర్‌ విడుదల

హాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్’ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ తెలుగు ప్రేక్షకులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. తెలుగు వెర్షన్‌లో హీరో హీ-మ్యాన్ పాత్రకు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తన వాయిస్ అందిస్తున్నారు. కార్తికేయ, కార్తికేయ 2, స్పై సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఇప్పుడు ఈ ఐకానిక్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇక విలన్ స్కెలెటర్ పాత్రకు ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ తన బేస్ వాయిస్‌ను అందించగా, డంకన్ పాత్రకు సీనియర్ నటుడు…

Read more
“స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే” పోస్టర్ విడుదల Telugu News

“స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే” పోస్టర్ విడుదల

హాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం స్పైడర్ -మన్ : బ్రాండ్ న్యూ డే నుండి కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించగా, ఇప్పుడు ఈ కొత్త పోస్టర్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ చిత్రం 2026 జూలై 31న ఇండియా లో ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. కొత్త పోస్టర్‌లో టామ్ హోలాండ్ పోషిస్తున్న పీటర్ పార్కర్ తన హూడీ కింద స్పైడర్-మ్యాన్ సూట్‌ను దాచుకుని కనిపిస్తున్నాడు. “ప్రపంచం పీటర్ పార్కర్‌ను మర్చిపోయినా… అతడు తన బాధ్యతను మాత్రం మర్చిపోలేదు” అనే భావాన్ని ఈ పోస్టర్ బలంగా…

Read more